50 రూపాయల కోసం గొడవ.. యువకుడిపై పిడిగుద్దులు.. రోడ్డుపైనే అనంత లోకాలకు

| Edited By: Pardhasaradhi Peri

Jan 21, 2021 | 8:43 AM

"అరవింద సమేత వీరరాఘవ" సినిమా చూశారా..? చిన్న ఎన్టీఆర్ సూపర్‌హిట్ సినిమా చూడకుండా ఎలా ఉంటారులెండి. ఆ సినిమా ప్రారంభంలో...

50 రూపాయల కోసం గొడవ.. యువకుడిపై పిడిగుద్దులు.. రోడ్డుపైనే అనంత లోకాలకు
Follow us on

“అరవింద సమేత వీరరాఘవ” సినిమా చూశారా..? చిన్న ఎన్టీఆర్ సూపర్‌హిట్ సినిమా చూడకుండా ఎలా ఉంటారులెండి. ఆ సినిమా ప్రారంభంలో రూ. 5 కోసం ప్రారంభమైన గొడవ.. హత్య వరకు దారితీస్తుంది. ఆపై రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ వార్‌గా మారుతుంది. తాజాగా అదే తరహాలో గుంటూరు జిల్లాలో రూ.50 కోసం జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది.

వివరాల్లోకి వెళ్తే..  గుంటూరు జిల్లా  సత్తెనపల్లిలో  రూ.50 అప్పు విషయంలో యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో బాజీ అనే యువకుడిపై మరో యువకుడు పిడిగుద్దులతో దాడి చేశాడు. దెబ్బలు బలంగా తాకడంతో బాజీ రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు అతడిని  ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యములోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read : ఇంటి ముందుకే రైస్‌మిల్.. యువకుడి వినూత్న ఆలోచన.. స్వయం ఉపాధితో పలువురికి ఆదర్శం‌