మనస్తాపంతో ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య

|

Mar 03, 2020 | 8:20 AM

హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ పరిధిలో విషాద సంఘటన వెలుగు చూసింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఓ వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకుఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణమని సూసైడ్‌ నోట్‌ రాసి

మనస్తాపంతో ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య
Follow us on

మనస్తాపంతో ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య

హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ పరిధిలో విషాద సంఘటన వెలుగు చూసింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఓ వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకుఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణమని సూసైడ్‌ నోట్‌ రాసి ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ కు సమీపంలోనే ఉన్న ఎల్‌బీనగర్‌ ఫ్లైఓవర్‌ పైకి తన బైక్‌ పై చేరుకున్నాడు. బైక్‌ను అక్కడే వదిలి పైనుంచి దూకాడు. తీవ్రంగా గాయపడటంతో స్థానికులు 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు.

మృతుడు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వనస్థలీపురంలోని సాగర్ కాంప్లెక్స్‌లో నివసిస్తూ..కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. అతడికి భార్య ఓ కుమారుడు ఉన్నట్లు సమాచారం. అయితే, గత కొలంగా వీరు ఆర్థిక ఇబ్బందులతో భాదపడుతున్నారని, దీంతో ఇంట్లో కూడా తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికుల చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన భాదితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కొడుకు చావుకు కోడలే కారణమని ఆరోపిస్తూ..ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతుడి జేబులో లభించిన రెండు సూసైడ్ లెటర్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెడ్‌బాడీ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.