కేసు పెట్టిన ఇద్దరు భార్యలు.. తలపట్టుకున్న భర్త

| Edited By: Pardhasaradhi Peri

Jul 26, 2020 | 3:15 PM

రెండో భార్యతో ఉన్న భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఓ మహిళ.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ లోపు రెండో భార్య కూడా తనను మోసం చేశాడంటూ అతడిపై కేసు పెట్టింది.

కేసు పెట్టిన ఇద్దరు భార్యలు.. తలపట్టుకున్న భర్త
Follow us on

రెండో భార్యతో ఉన్న భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఓ మహిళ.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ లోపు రెండో భార్య కూడా.. తనను మోసం చేశాడంటూ అతడిపై కేసు పెట్టింది. దీంతో ఆ భర్త తల పట్టుకున్నాడు. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన వెంకట చలపతి 13 ఏళ్ల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక పాప కూడా ఉంది. అయితే కొన్నాళ్ల తర్వాత ఇతగాడు మరో యువతికి గాలం వేశాడు. తాను బ్యాచులర్‌ని అని నమ్మించి.. నెల్లూరుకు చెందిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే తన భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన మొదటి భార్య అతడి బాగోతాన్ని తెలుసుకుంది. ఈ క్రమంలో రెండో భార్యతో కలిసి వెళ్తున్న తన భర్తను చూసి.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే బైక్‌పై రెండో భార్యతో వెళుతున్న చలపతి..  మొదటి భార్య, కూతురుని చూసి తప్పించుకున్నాడు. వారు ఎంత పిలుస్తున్నా స్పీడుగా బైక్‌పై వెళ్లిపోయాడు. దీంతో భార్య, కుమార్తె కన్నీరు మున్నీరుగా విలపించారు. అమ్మా.. డాడీని మర్చిపో. నంబర్‌ను డిలీట్ చేయ్ అంటూ కుమార్తె రోడ్డుపై ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ క్రమంలో వీరి సమస్యపై స్పందించిన మహిళా పోలీసులు మొదటి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇక మరోవైపు రెండో భార్య రంగంలోకి వచ్చి.. చలపతి తనను మోసం చేశాడని కేసు పెట్టింది. బ్యాచురల్‌ అని నమ్మించి తనను వివాహం చేసుకున్నాడని.. తానిప్పుడు గర్భవతి అని భోరుమంది. ఇక ఇద్దరి ఫిర్యాదుల మేరకు పోలీసులు రెండు కేసులు నమోదు చేసుకోగా.. ఏమి చేయాలో తెలియక వెంకట చలపతి తల పట్టుకున్నాడు.

Read This Story Also: కీర్తిని ‘క్రాక్ పిల్ల’ అన్న ‘మహానటి’ నిర్మాత