కోగంటి సత్యం అరెస్ట్

| Edited By: Pardhasaradhi Peri

Jul 08, 2019 | 8:27 PM

వ్యాపారవేత్త రాం ప్రసాద్ హత్యలో పలు కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యాపారవేత్త కోగంటి సత్యాన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమ తండ్రిని కోగంటి సత్యమే హత్యచేయించాడని మ‌ృతుడు రాంప్రసాద్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపధ్యంలో ఈ అరెస్ట్ జరిగినట్టుగా తెలుస్తోంది. మా నాన్నను చంపాల్సిన అవసరం ఆయనకు తప్ప మరెవ్వరికీ లేదని రాంప్రసాద్ కొడుకు కూడా చెబుతున్నారు. అయితే ఈ హత్యను తామే చేశామంటూ శ్యామ్ అనే వ్యక్తి తెరపైకి […]

కోగంటి సత్యం  అరెస్ట్
Follow us on

వ్యాపారవేత్త రాం ప్రసాద్ హత్యలో పలు కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యాపారవేత్త కోగంటి సత్యాన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమ తండ్రిని కోగంటి సత్యమే హత్యచేయించాడని మ‌ృతుడు రాంప్రసాద్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపధ్యంలో ఈ అరెస్ట్ జరిగినట్టుగా తెలుస్తోంది. మా నాన్నను చంపాల్సిన అవసరం ఆయనకు తప్ప మరెవ్వరికీ లేదని రాంప్రసాద్ కొడుకు కూడా చెబుతున్నారు.

అయితే ఈ హత్యను తామే చేశామంటూ శ్యామ్ అనే వ్యక్తి తెరపైకి రావడంతో కేసు మరో మలుపు తిరిగినట్టయ్యింది. రాం ప్రసాద్‌ను అతని బావమరిది ఊర శ్రీనివాస్ చంపమంటేనే తాము చంపామని శ్యామ్ అనే వ్యక్తి టీవీతో చెప్పాడు. అదే సమయంలో అసలు శ్యామ్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని ఊర శ్రీనివాస్ కూడా టీవీ9తో చెప్పాడు.

తాజాగా అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆతడ్ని సికింద్రబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కోగంటిని విచారిస్తున్నారు.