మిస్టరీ వీడింది..ఇంటర్ విద్యార్థిని హత్యకేసులో కన్నతండ్రే హంతకుడు

| Edited By: Pardhasaradhi Peri

Mar 02, 2020 | 8:01 PM

కరీంనగర్‌ జిల్లాలో ఫిబ్రవరి 10న హత్యకు గురైన ఇంటర్‌ విద్యార్ధిని రాధిక మర్డర్‌ మిస్టరీ వీడింది. హత్య జరిగిన 21రోజుల తర్వాత కేసును చేధించారు పోలీసులు. బాలిక తండ్రి కొమురయ్యే హత్య చేసినట్లు నిర్దారించారు. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా నిందితుడు నిజం ఒప్పుకున్నాడు. కరీంనగర్‌ పట్టణంలోని విద్యానగర్ వెంకటేశ్వర కాలనీలో ఫిబ్రవరి 10న ఇంట్లోనే రాధిక దారుణ హత్యకు గురైంది. గొంతు కోసి అతి కిరాతకంగా మర్డర్ చేశారు. ఇంట్లో ఎవరూ లేని […]

మిస్టరీ వీడింది..ఇంటర్ విద్యార్థిని హత్యకేసులో కన్నతండ్రే హంతకుడు
Follow us on

కరీంనగర్‌ జిల్లాలో ఫిబ్రవరి 10న హత్యకు గురైన ఇంటర్‌ విద్యార్ధిని రాధిక మర్డర్‌ మిస్టరీ వీడింది. హత్య జరిగిన 21రోజుల తర్వాత కేసును చేధించారు పోలీసులు. బాలిక తండ్రి కొమురయ్యే హత్య చేసినట్లు నిర్దారించారు. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా నిందితుడు నిజం ఒప్పుకున్నాడు.

కరీంనగర్‌ పట్టణంలోని విద్యానగర్ వెంకటేశ్వర కాలనీలో ఫిబ్రవరి 10న ఇంట్లోనే రాధిక దారుణ హత్యకు గురైంది. గొంతు కోసి అతి కిరాతకంగా మర్డర్ చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ హత్య జరిగింది. ఆ సమయంలో కూలి పనుల కోసం బయటకు వెళ్లామని రాధిక తల్లిదండ్రులు పోలీసులతో చెప్పారు. పక్కింట్లోని తొమ్మిదేళ్ల పిల్లాడు… ఆ ఇంటికి రావడంతో… రాధిక మర్డర్ విషయం వెలుగులోకి వచ్చింది. రాధిక హత్య కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. రాధికను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో ఈ కేసు సవాల్ గా మారింది. ఇంట్లో అద్దెకు ఉండే కుర్రాడు… కొంతకాలంగా రాధిక వెంట పడుతున్నాడని, అతడే చంపి ఉంటాడని తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాఫ్తు చేశారు. ఆ కుర్రాడి కోసం 75 మంది పోలీసులతో… 8 బృందాలు ఏర్పాటు చేశారు. 20 రోజులు వెతికినా… అతను కనిపించలేదు. ఈలోగా దర్యాప్తులో కొత్త విషయాలు తెలిశాయి.

రాధిక అనారోగ్యంగా ఉండటంతో…ఖర్చు పెట్టలేక తండ్రే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. గత కొన్నేళ్లుగా రాధిక తీవ్ర అనారోగ్యం, పోలియోతో బాధపడుతోంది. అనేక ఆస్పత్రుల్లో ఆమెకు చికిత్స చేయించిన కొమరయ్య  దాదాపు 6 లక్షల రూపాయల వరకు ఖర్చుపెట్టాడు. ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో ఏడాది క్రితం క్రితం రాధికను కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరలో చేర్పించాడు. గత కొద్ది రోజులగా ఆమెకు అనారోగ్య సమస్యలు తిరగబెట్టాయి. మళ్ళీ డబ్బులు ఖర్చుపెట్టి పెట్టాల్సి వస్తోందని కొమురయ్య..తన కుమార్తెను అతికిరాతకంగా అంతమొందించాడు.  లేటెస్ట్ టెక్నాలజీతో  పాటు సిసి కెమెరాలు, పాత నేరస్తుల కదలికలు, జర్మన్ టెక్నాలజీ, సైబర్ ఫోరెన్సిక్ టెక్నిక్స్  ఉపయోగించి పోలీసులు నిందితుడి ఆట కట్టించారు.