Student Suicide: లైంగిక వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..!

| Edited By:

Feb 24, 2020 | 3:11 PM

Student Suicide: లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది ఓ విద్యార్థిని. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సఖినేటిపల్లి మండలం మోరిపోడులో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఓ యువతిని ఓ యువకుడు గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. వాటిని భరించలేక సూసైడ్ లెటర్ రాసిన ఆమె ఉరేసుకుంది. కాగా ఆ లెటర్‌లో.. ఆ యువకుడి పేరును రాయనప్పటికీ.. తన ఫొటోలతో బెదిరిస్తున్నాడంటూ పేర్కొంది. […]

Student Suicide: లైంగిక వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..!
Follow us on

Student Suicide: లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది ఓ విద్యార్థిని. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సఖినేటిపల్లి మండలం మోరిపోడులో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఓ యువతిని ఓ యువకుడు గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. వాటిని భరించలేక సూసైడ్ లెటర్ రాసిన ఆమె ఉరేసుకుంది. కాగా ఆ లెటర్‌లో.. ఆ యువకుడి పేరును రాయనప్పటికీ.. తన ఫొటోలతో బెదిరిస్తున్నాడంటూ పేర్కొంది. రూమ్‌కు రమ్మని గత కొద్ది రోజులుగా అతడు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపింది. అంతేకాదు అతడిని వదిలేయాలని, ఇదే తన చివరి కోరికంటూ వెల్లడించింది. మరోవైపు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు., కేసు నమోదు చేసుకొని ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.