లిప్ట్ అడిగి..మ‌హిళల నెంబ‌ర్లు తీసుకుని వేధిస్తోన్న కానిస్టేబుల్ అరెస్ట్…

|

Jul 12, 2020 | 7:56 PM

మహిళల్ని వేధింపులకు గురి చేస్తోన్న కేసులో టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ వీరబాబును బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో వెళ్తున్న మహిళల‌ను లిఫ్ట్‌ అడిగి... వారి ఫోన్‌ నంబర్లు తీసుకుని వేధిస్తున్నాడని వీరబాబుపై కంప్లైంట్స్ వ‌చ్చాయి.

లిప్ట్ అడిగి..మ‌హిళల నెంబ‌ర్లు తీసుకుని వేధిస్తోన్న కానిస్టేబుల్ అరెస్ట్...
Follow us on

మహిళల్ని వేధింపులకు గురి చేస్తోన్న కేసులో టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ వీరబాబును బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో వెళ్తున్న మహిళల‌ను లిఫ్ట్‌ అడిగి… వారి ఫోన్‌ నంబర్లు తీసుకుని వేధిస్తున్నాడని వీరబాబుపై కంప్లైంట్స్ వ‌చ్చాయి. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు వీరబాబుపై కంప్లైంట్ చేశారు.

లిఫ్ట్‌ అడిగి కారెక్కిన వీరబాబు ఫోన్‌ నంబరు తీసుకొని ఫోన్లు చేయ‌డంతో పాటు, మెసేజీల‌తో వేధించాడని సిటీకి చెందిన ఇద్దరు మహిళలు సైఫాబాద్‌, బంజారాహిల్స్ పీఎస్ ల‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు వీరబాబును అదుపులోకి తీసుకున్నారు. వీరబాబుపై ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్ల‌డించారు.