లుడో గేమ్‌లో భార్య గెలిచినందుకు వెన్ను విరగ్గొట్టిన భర్త!

లాక్‌డౌన్ కారణంగా.. అతను ఇంట్లోనే ఉండటంతో.. బయటకు వెళ్లి ఇరుగుపొరుగువారితో మాట్లాడటం చేసేవాడు. అయితే అతన్ని ఇంట్లోనే ఉంచేందుకు భార్య లుడో గేమ్ ఆడదామని కోరింది. అయితే ఆ గేమ్‌లో వరుసగా నాలుగు రౌండ్లు పాటు భార్యనే..

లుడో గేమ్‌లో భార్య గెలిచినందుకు వెన్ను విరగ్గొట్టిన భర్త!
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 4:10 PM

ఆన్‌లైన్‌లో లుడో గేమ్‌లో భార్య గెలిచినందుకు వెన్ను విరగ్గొట్టాడు ఓ శాడిస్ట్ భర్త. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితయ్యారు. ఇక చాలా మందికి ఫోనే ప్రపంచం అయిపోయింది. కొందరు గేమ్స్ ఆడుతూవుంటే మరికొందరు సినిమాలు చేయడం లేదా.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. మరికొందరు ఇరుగుపొరుగు వారితో మాట్లాడుకోవటం జరుగుతోంది. ఇలా తన భర్త ఇరుగుపొరుగు వారితో గడపటం చూసి.. అతన్ని ఇంట్లోనే ఉంచేందుకు ఫోన్‌లో లుడో గేమ్ ఆడదామని కోరింది. అయితే అదే ఆమె చేసిన నేరమై ఉండొచ్చు.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లో వడోదరలోని వేమలి ప్రాంతంలో నివసించే ఓ 24 ఏళ్ల యువతి ఇంట్లోనే ఉంటూ ట్యూషన్లు చెబుతూ ఉంటుంది. ఆమె భర్త ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేసేవాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా.. అతను ఇంట్లోనే ఉండటంతో.. బయటకు వెళ్లి ఇరుగుపొరుగువారితో మాట్లాడటం చేసేవాడు. అయితే అతన్ని ఇంట్లోనే ఉంచేందుకు భార్య లుడో గేమ్ ఆడదామని కోరింది. అయితే ఆ గేమ్‌లో వరుసగా నాలుగు రౌండ్లు పాటు భార్యనే గెలిచింది. భర్త చిత్తుగా ఓడిపోయాడు. దీన్ని అవమానంగా భావించిన భర్త భార్యపై కిరాతకంగా దాడి చేశాడు. కిందపడేసి అమానుషంగా కొట్టాడు. దాంతో ఆమె వెన్నుముకకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిపాలైంది. అనంతరం గృహహింస హెల్ప్ నెంబర్‌కి ఫోన్ చేయగా.. వారు రాజీ కుదిర్చారు. భర్తతో ఆమెకు క్షమాపణలు చెప్పించి.. ఇలాంటివి రిపీట్ కావొద్దని కౌన్సిలింగ్ ఇచ్చారు.

Read More: 

మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

విజయ్‌తో ఆ రొమాంటిక్ సీన్స్ నాకు అవసరమా అనిపించింది

Latest Articles