భారీగా నిషేధిత గుట్కా, ఫారిన్ సిగరెట్లు స్వాధీనం.. నలుగురు అరెస్ట్..

| Edited By:

Jun 20, 2020 | 6:12 PM

కృష్ణా జిల్లాలో భారీగా నిషేధిత గుట్కాతో పాటు.. గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. జిల్లాలోని కంచికచర్ల మండలం దోనబండ చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా..

భారీగా నిషేధిత గుట్కా, ఫారిన్ సిగరెట్లు స్వాధీనం.. నలుగురు అరెస్ట్..
Follow us on

కృష్ణా జిల్లాలో భారీగా నిషేధిత గుట్కాతో పాటు.. గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. జిల్లాలోని కంచికచర్ల మండలం దోనబండ చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ వాహనంలో పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు, గంజాయిని పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఫారిన్ సిగరెట్లు కూడా ఆ వాహనంలో గుర్తించారు. వీటిని హైదరాబాద్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని యానాంకు తరలిస్తున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ రూ.54 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇక సిగరెట్ల విలువ రూ.1.5లక్షల వరకు ఉంటుందన్నారు. వీటోతో పాటు పట్టుబడ్డ గంజాయి 5.5 కేజీలు ఉందని.. వీరి వద్ద నుంచి రూ.6.30 లక్షల నగదుతో పాటు.. ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అంతేకాదు.. బోలెరో వ్యాన్‌, ఆటో కూడా సీజ్ చేశారు. పట్టుబడ్డ నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.