Girl Deceased Cardiac Arrest: పాపం పసిపాప.. విమానంలోనే ప్రాణాలు వదిలింది.. కారణం ఏంటో తెలుసా..

|

Jan 20, 2021 | 1:31 PM

Girl Deceased Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఓ చిన్నారి విమానంలోనే మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌, సిద్దార్ద్‌ నగర్‌కు చెందిన

Girl Deceased Cardiac Arrest: పాపం పసిపాప.. విమానంలోనే ప్రాణాలు వదిలింది.. కారణం ఏంటో తెలుసా..
Follow us on

Girl Deceased Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఓ చిన్నారి విమానంలోనే మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌, సిద్దార్ద్‌ నగర్‌కు చెందిన ఆయుషి పున్వసి ప్రజాపతి అనే ఏడేళ్ల బాలిక అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె తండ్రి ముంబైలోని ఆసుపత్రికి తీసుకెళ్లటానికి పాపను తీసుకొని గో ఏయిర్‌ విమానాన్ని ఎక్కారు. అయితే విమానం గాల్లో ఉండగానే బాలిక కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైంది. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ద్వారా విమానాన్ని ఆపి బాలికను నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో ఆమె తండ్రి ఒక్కసారిగి కుప్పకూలిపోయాడు. అయితే విమానం ఎత్తు కారణంగానే పాప కార్డియాక్ అరెస్ట్‌కు గురైనట్లు వైద్య నిపుణులు భావిస్తున్నారు. దీనిపై గో ఏయిర్‌ అధికారులు మాట్లాడుతూ వివరణ ఇస్తూ.. పాప రక్తహీనతతో బాధపడుతోందని, తండ్రి ఆ విషయం మాకు చెప్పలేదని, ఒకవేళ చెప్పుంటే విమానం ఎక్కనిచ్చే వాళ్లం కాదని బదులిచ్చారు. 8-10 గ్రాముల కంటే తక్కవ హిమోగ్లోబిన్‌ ఉన్న వాళ్లు విమానప్రయాణానికి అనర్హులుగా గుర్తుచేశారు.

మరో చిన్నారికి అండగా నిలిచిన సూపర్ స్టార్ .. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పాపను కాపాడిన మహేష్