Ganja Gang War: గంజాయి గ్యాంగ్ వార్: కత్తులు, బండరాళ్లతో గల్లీలో కొట్టుకున్న ముఠా.. ఒకరు మ‌ృతి

తమిళనాడులో ఇవాళ దారుణం చోటుచేసుకుంది. గంజాయి గ్యాంగ్ గల్లీలో కత్తులు, బండరాళ్లతో కొట్టుకున్నారు. నార్త్ చెన్నై

Ganja Gang War: గంజాయి గ్యాంగ్ వార్:  కత్తులు, బండరాళ్లతో గల్లీలో కొట్టుకున్న ముఠా.. ఒకరు మ‌ృతి
Ganja Gang War

Updated on: Aug 14, 2021 | 5:44 PM

Cannabis Gang War: తమిళనాడులో ఇవాళ దారుణం చోటుచేసుకుంది. గంజాయి గ్యాంగ్ గల్లీలో కత్తులు, బండరాళ్లతో కొట్టుకున్నారు. నార్త్ చెన్నై లోని తండయార్పెట్టలో వున్న హోసింగ్ బోర్డులో గంజాయి అమ్మకాల్లో ఇరువర్గాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరి చివరికి ప్రాణాలు పోయేంతలా కొట్టుకునే స్థితి వచ్చింది.

జరిగిన దారుణాన్ని కళ్లారా చూసిన స్థానిక మహిళలు అరుపులతో ఘటనా ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. ప్రత్యర్థులు కొట్టిన దెబ్బలకు ఒక యువకుడు మృతి చెందడంతో హోసింగ్ బోర్డు కాలనీ మొత్తం ఉద్రిక్తంగా మారింది.

కాలనీలో ఉన్న మహిళలు, కొందరు స్థానికులు ఎంత వారించినా వినకుండా సదరు గంజాయి గ్యాంగ్ కత్తులతో, బండరాళ్లతో ఒక సినిమా క్రైం సీన్‌ను తలపించేలా అరాచకం సృష్టించారు. చివరికి ఈ గ్యాంగ్ వార్‌లో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.