పంజాబ్ బ్యాంక్ ఉద్యోగులపై సీబీఐ కేసు..!

|

Jun 12, 2020 | 9:45 PM

పీఎన్‌బీ ప్రస్తుత, మాజీ అధికారులు నలుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.31 కోట్ల మేరకు మోసగించినట్లు ఆరోపించింది.

పంజాబ్ బ్యాంక్ ఉద్యోగులపై సీబీఐ కేసు..!
Follow us on

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిధుల దుర్వినియోగం కేసును వేగవంతం చేసింది సిబీఐ. పీఎన్‌బీ ప్రస్తుత, మాజీ అధికారులు నలుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.31 కోట్ల మేరకు మోసగించినట్లు ఆరోపించింది. పీఎన్‌బీ సర్కిల్ హెడ్ గణపత్ లాల్ ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
పీఎన్‌బీ స్టేషన్ స్క్వేర్ శాఖ నిబంధనలను ఉల్లంఘించి గ్లోబల్ ట్రేడింగ్ సొల్యూషన్స్‌కు రుణాలు ఇచ్చిందని సీబీఐ ఆరోపించింది. ఈ రుణాల మంజూరు సమయంలో పీఎన్‌బీ స్టేషన్ స్క్వేర్ శాఖ చీఫ్ మేనేజర్‌గా పని చేసిన నాగమణి సత్యనారాయణ ప్రసాద్, మాజీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్‌సీ శర్మ, మాజీ చీఫ్ మేనేజర్ మనోరంజన్ దాస్, అప్పట్లో ఈ శాఖ సీనియర్ మేనేజర్‌గా పని చేసిన ప్రియతోష్ దాస్‌లపై అవినీతి నిరోధక చట్టం, భారత శిక్షా స్మృతి ప్రకారం కేసు నమోదు చేసింది. గ్లోబల్ ట్రేడింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అవినాశ్ మహంతి, మాజీ డైరెక్టర్లు కౌసిక్ మహంతి, అన్షుమాన్, ప్రస్తుత డైరెక్టర్ విధుభూషణ్ నాయక్, తదితరులను కూడా ఈ కేసులో నిందితులుగా సీబీఐ చేర్చింది. త్వరలో కేసు సంబంధం ఉన్న మరి కొందరిని కూడా విచారించనున్నట్లు సిబీఐ తెలిపింది.