పాల్‌ఘర్‌ మూకదాడి కేసులో మరో ఐదుగురు అరెస్ట్..

| Edited By:

May 01, 2020 | 7:36 PM

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్‌ఘర్‌ మూకదాడి గురించి తెలిసిందే. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ ప్రాంతలోని ఓ గ్రామంలో ఇద్దరు సాధువలపై మూకదాడి చేసి హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటుగా డ్రైవర్‌ కూడా మరణించారు. తమ గురువు పరమపదించారని తెలిసి.. అంత్యక్రియల కోసం వెళ్తున్న సాధువులను దొంగలన్న ఆరోపణలతో  గ్రామస్తులు హతమార్చారు. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే లేపింది. తొలుత ఈ ఘటనకు ముస్లింలకు లింకు పెట్టడంతో హాట్ టాపిక్‌గా మారింది. […]

పాల్‌ఘర్‌ మూకదాడి కేసులో మరో ఐదుగురు అరెస్ట్..
Follow us on

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్‌ఘర్‌ మూకదాడి గురించి తెలిసిందే. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ ప్రాంతలోని ఓ గ్రామంలో ఇద్దరు సాధువలపై మూకదాడి చేసి హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటుగా డ్రైవర్‌ కూడా మరణించారు. తమ గురువు పరమపదించారని తెలిసి.. అంత్యక్రియల కోసం వెళ్తున్న సాధువులను దొంగలన్న ఆరోపణలతో  గ్రామస్తులు హతమార్చారు. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే లేపింది. తొలుత ఈ ఘటనకు ముస్లింలకు లింకు పెట్టడంతో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉద్దవ్‌తో మాట్లాడారు. అనంతరం సీఎం ఉద్దవ్ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. దీంతో ఘటనకు సంబంధించిన 110 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 9 మంది మైనర్లు కూడా ఉన్నారు. అయితే వీరిని జువైనల్‌కు తరలించి.. మిగతా వారిని పోలీస్ కస్టడీలోనే ఉంచుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం తాజాగా మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 115కు చేరుకుంది. శుక్రవారం అరెస్టైన ఐదురుగు నిందితులను ఈ నెల 13 వరకు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసింది.