తాత్కాలిక జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరార్

| Edited By:

Jul 17, 2020 | 4:27 AM

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా జైలులో తక్కువ మంది ఖైదీలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. పలు తాత్కాలిక జైలులను కూడా ఏర్పాటు చేస్తున్నాయి పలు..

తాత్కాలిక జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరార్
Follow us on

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా జైలులో తక్కువ మంది ఖైదీలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. పలు తాత్కాలిక జైలులను కూడా ఏర్పాటు చేస్తున్నాయి పలు రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో ఇదే అదనుగా ఖైదీలు తప్పించుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇటీవల పూణెలోని యరవాడ సెంట్రల్‌ జైలులో ఉన్న ఐదుగురు ఖైదీలను ఓ ప్రభుత్వ హాస్టల్‌ని తాత్కాలిక జైలుగా ఏర్పాటుచేసి అందులో ఉంచారు. కరోనా వ్యాప్తి కారణంగా ఇలా ప్రత్యేక గదులతో తాత్కాలిక జైలును ఏర్పాటు చేస్తే.. ఇదే అదనుగా అందులో ఉన్న ఐదుగురు ఖైదీలు కిటికీలను తొలగించి పరారయ్యారు. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది.

మహారాష్ట్ర జైళ్ల విభాగం అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. తాత్కాలిక జైలు కిటికీలను పగలగొట్టి ఐదుగురు ఖైదీలు పరారయ్యారని తెలిపారు. పారిపోయిన వారిని దేవగన్ అజినాథ్‌ చవాన్, గణేష్ చవాన్, అక్షయ్ చవాన్, అజింక్య కాంబ్లే, సన్నిపింటోగా గుర్తించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తుగా జాగ్రత్తగా వీరిని తాత్కాలిక జైలులో ప్రత్యేక గదుల్లో ఉంచినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వీరు పారిపోయారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని.. తప్పించుకున్న ఖైదీలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. వీరిపై ఇప్పటికే పలు క్రైం కేసులు ఉన్నాయని.. దోపిడి, దొంగతనాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.