వరంగల్ మర్డర్ మిస్టరీలో బయటపడ్డ మరో కొత్త కోణం.. 10 కూడా కాదు..

| Edited By:

May 27, 2020 | 6:35 PM

గీసుకొండ సామూహిక డెత్‌ మిస్టరీలో మరో కొత్త కోణం బయటపడింది. సంజయ్ కుమార్ నేర చరిత్రపై ఆరా తీస్తున్న పోలీసులకు మరిన్ని కొత్త విషయాలు తెలిశాయి. అటు రఫీకా ఫ్యామిలీ హిస్టరీపై కూడా పోలీసులు ఆరా తీశారు. దీంతో నాలుగేళ్ల క్రితమే రఫీకా - సంజయ్ కుమార్ యాదవ్‌కు ఢిల్లీలోని...

వరంగల్ మర్డర్ మిస్టరీలో బయటపడ్డ మరో కొత్త కోణం.. 10 కూడా కాదు..
Follow us on

వరంగల్‌‌ మర్డర్ మిస్టరీ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మర్డర్ కేసులోని మిసర్టీని 72 గంటల్లో చేధించారు పోలీసులు. ఈ మేరకు మే 25వ తేదీన వరంగల్ సీపీ రవిందర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే రైలులో చనిపోయిన మహిళతో కలిపి మొత్తం 10 హత్యలు చేసిందీ.. బీహార్‌కి చెందిన సంజయే అని నిర్థారణ అయింది. శీతల పానీయంలో నిద్ర మాత్రలు కలిపి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాక వారిని బావిలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. విచారణలో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అయితే ఇప్పుడు గీసుకొండ సామూహిక డెత్‌ మిస్టరీలో మరో కొత్త కోణం బయటపడింది. సంజయ్ కుమార్ నేర చరిత్రపై ఆరా తీస్తున్న పోలీసులకు మరిన్ని కొత్త విషయాలు తెలిశాయి. అటు రఫీకా ఫ్యామిలీ హిస్టరీపై కూడా పోలీసులు ఆరా తీశారు. దీంతో నాలుగేళ్ల క్రితమే రఫీకా – సంజయ్ కుమార్ యాదవ్‌కు ఢిల్లీలోని ఓ ఫర్నీచర్ షాపులో పరిచయం ఏర్పడినట్లు గుర్తించారు పోలీసులు. ఆ సమయంలోనే రఫీకా భర్త అదృశ్యమయ్యాడు. అతన్ని కూడా సంజయ్ కుమార్ యాదవే హత్య చేసి వుంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు. అతని మిస్సింగ్ హిస్టరీ వీడితే.. 10 హత్యలు కాస్తా.. 11కు చేరనున్నాయి. కాగా వరుస హత్యలతో మరోమారు దేశంలో సంచలనంగా మారాడు మానవ మృగం సంజయ్ కుమార్ యాదవ్.

Read More:

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!

వాహనదారులకు మరో శుభవార్త.. ఇక వాట్సాప్‌ నుంచి రవాణా శాఖ సేవలు..

కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు