షేక్‌పేట డివిజన్‌లో పోలింగ్ బూత్ దగ్గర గొడవ.. ఎంఐఎం, బీజేపీ నేతల బాహాబాహి.. బీజేపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు

| Edited By: Ravi Kiran

Dec 02, 2020 | 11:02 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల హడావిడి కనిపించిందే తప్పా ఓటర్ల సందడి ఎక్కడా కనిపించ లేదు.

షేక్‌పేట డివిజన్‌లో పోలింగ్ బూత్ దగ్గర గొడవ.. ఎంఐఎం, బీజేపీ నేతల బాహాబాహి.. బీజేపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల హడావిడి కనిపించిందే తప్పా ఓటర్ల సందడి ఎక్కడా కనిపించ లేదు. గతంతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం కూడా చాలా బాగా తగ్గిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఎలక్షన్స్ ప్రశాంతంగానే జరిగినా అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు జరిగాయి. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటూ బాహాబాహికి దిగారు. సకాలంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఎక్కడి వాటిని అక్కడే సద్దుమణిగేలా చేశారు.

అయితే షేక్‌పేట డివిజన్‌లో ఓ పోలింగ్ బూత్ దగ్గర జరిగిన గొడవ గురించి ప్రధానంగా అందరు చర్చించుకుంటున్నారు. షేక్‌పేట డివిజన్ పరిధిలో ఎంఐఎం, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగ్గా ఒకరినొకరు ముష్టిఘాతాలతో దాడి చేసుకున్నారు. ఎంఐఎం నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే బీజేపీ శ్రేణులు అడ్డుతగిలారు. దీంతో ఎంఐఎంకు చెందిన పలువురు నాయకులు బీజేపీ నేతలపై దాడికి దిగారు. ఈ గొడవలో బీజేపీకి చెందిన ఓ కార్యకర్త దారుణంగా గాయపడ్డాడు. ఎంఐఎం పార్టీ సభ్యులు గుంపుగా ఏర్పడి ఒక్కసారిగా విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి దాడిలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేశారు.