ఒంగోలు సీఐపై సస్పెన్షన్ వేటు

|

Aug 21, 2020 | 7:48 PM

సివిల్‌ వివాదాల్లో పోలీసులు తలదూర్చి సెటిల్మెంట్లకు పాల్పడుతున్న ఓ పోలీసు అధికారిపై వేటుపడింది. ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మణ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఫిర్యాదుదారులపై బెదిరింపులకు దిగుతున్నారన్న విమర్శలు రావడంతో చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్ట్ కౌశల్ తెలిపారు.

ఒంగోలు సీఐపై సస్పెన్షన్ వేటు
Follow us on

సివిల్‌ వివాదాల్లో పోలీసులు తలదూర్చి సెటిల్మెంట్లకు పాల్పడుతున్న ఓ పోలీసు అధికారిపై వేటుపడింది. ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మణ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఫిర్యాదుదారులపై బెదిరింపులకు దిగుతున్నారన్న విమర్శలు రావడంతో చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్ట్ కౌశల్ తెలిపారు. సివిల్ కేసులు, పంచాయితీలు చేస్తున్నారనే ఆరోపణలపై సీఐపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఆరోపణలపై ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ విచారణ చేపట్టారు. విచారణ నివేదికతో పాటు ఎస్పీ సిఫారసు మేరకు సీఐ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. పామూరు సీఐగా పనిచేస్తున్న శివరామకృష్ణారెడ్డిని ఒంగోలు తాలూకా సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.