ప్రేమికుల మధ్య కోపతాపాలు కామన్. ఇప్పుడు అరుచుకున్నా.. కాసేపటికి లేదా.. కొన్ని రోజుల తర్వాత కలిసిపోతారు. అలాగే.. చిన్న చిన్న పోట్లాటలూ సాధారణమే. ఇదిలా వుంటే.. ఓ ప్రియురాలి మాత్రం అతని ప్రియుడి పట్ల కర్కశంగా ప్రవర్తించింది. ఐస్‌క్రీం కొనివ్వలేదని.. ఏకంగా.. కత్తితో పొడిచింది.
వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని హెనెన్ ప్రాంతాని చెందిన ఓ యువతి.. అతని ప్రియుడితో కలిసి ఓ మాల్‌కు వెళ్లింది. షాపింగ్ చేసుకున్నారు. అలాఅలా హ్యాపీగా తిరిగారు కూడా. అలసిపోయి అక్కడే వున్న ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌కి వెళ్లి ఐస్‌క్రీమ్ తిన్నారు. కాగా.. యువతి నాకు ఇంకా ఐస్‌క్రీమ్స్ కావాలని.. ప్రియుడికి అడగకా.. అతను వద్దని వారించాడు. అయినా.. ఆ యువతి అడుగుతూనే ఉంది. దీనికి అసహనం వ్యక్తం చేస్తూ.. ‘ఇప్పటికే చాలా తిన్నవు.. ఇంకా తింటే బాగా లావుగా అయిపోతావు’ అని ఆమె శరీరాకృతి గురించి కామెంట్ చేస్తూ చెప్పాడు.
దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ.. టేబుల్ మీద చాక్ తీసుకుని.. పలుమార్లు పొడిచింది. ఇది చూసిన జనం పరుగులు పెట్టారు. స్పాట్లోనే అతను చనిపోయాడు. అతనంతరం ఆమె అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినా.. ఇంతలోనే పోలీసులు రంగప్రవేశంతో.. ఆమెను అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు.