బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదు.. టీఆర్ఎస్ లీగల్‌ సెల్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదు..

|

Nov 25, 2020 | 2:21 PM

బీజేపీ నేత, నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టీఆర్ఎస్ లీగల్ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ అరవింద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ నగరంలోని కేబీఆర్ పార్క్ దగ్గర టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను చించివేసిన ఘటనకు సంబంధించి టీఆర్ఎస్ లీగల్ సెల్ పోలీసులను ఆశ్రయించింది.

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదు.. టీఆర్ఎస్ లీగల్‌ సెల్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదు..
Follow us on

బీజేపీ నేత, నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టీఆర్ఎస్ లీగల్ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ అరవింద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ నగరంలోని కేబీఆర్ పార్క్ దగ్గర టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను చించివేసిన ఘటనకు సంబంధించి టీఆర్ఎస్ లీగల్ సెల్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో స్పందించిన పోలీసులు ఆయనపై 504, 506, 427 సె​క్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి విజయదుర్గ సందీప్ యాదవ్‌కు మద్దతుగా అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, దుబ్బాక ఎన్నికల్లో ఎలా నిజాయితీకి ఓటు వేశారో అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓటు వేసి నవశకానికి నాంది పలకాలని ఆయన కోరారు.