Telugu Akademi: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో కీలక మలుపు.. డబ్బు తిరిగి చెల్లిస్తామన్న బ్యాంక్!

|

Dec 16, 2021 | 12:25 PM

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో పురోగతి కనిపించింది. కెనరా బ్యాంకులో నిందితులు కొల్లగొట్టిన డబ్బును తిరిగి చెల్లించేందుకు అంగీకారం కుదిరింది.

Telugu Akademi: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో కీలక మలుపు.. డబ్బు తిరిగి చెల్లిస్తామన్న బ్యాంక్!
Telugu Akademi
Follow us on

Telugu Akademi Funds Fraud: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో పురోగతి కనిపించింది. కెనరా బ్యాంకులో నిందితులు కొల్లగొట్టిన డబ్బును తిరిగి చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. 10 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడానికి అంగీకరించారు కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు. రెండు రోజుల్లోపు 10 కోట్ల రూపాయలను తెలుగు అకాడమీ ఖాతాలో డిపాజిట్ చేసే ఛాన్స్‌ ఉంది. అకాడమీకి సంబంధించిన 10 కోట్ల రూపాయలను చందానగర్​లోని కెనరా బ్యాంకులో ఏడాది కాల వ్యవధికి డిపాజిట్ చేశారు అధికారులు.

అయితే, బ్యాంక్ మేనేజర్ సాధనతో చేతులు కలిపి, నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకు ఉన్న డిపాజిట్​ను ఇతర బ్యాంకుకు మళ్లించారు నిందితులు. ఆ తర్వాత డబ్బును విడతల వారీగా విత్​డ్రా చేసుకున్నారు. బ్యాంకు మేనేజర్ హస్తంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్​ను ఇతర ఖాతాలోకి మళ్లించిన తతంగాన్ని హైదరాబాద్​ సీసీఎస్ పోలీసులు, తెలుగు అకాడమీ అధికారులు కెనరా బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకు ఉన్నతాధికారులు అడిగిన పత్రాలను సమర్పించారు తెలుగు అకాడమీ అధికారులు.

యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులతోనూ తెలుగు అకాడమీ ఆఫీసర్లు సమావేశమై, మొత్తం పరిస్థితిని విరవించారు. కార్వాన్ యూనియన్ బ్యాంకులో 40 కోట్లు, సంతోష్‌నగర్ శాఖలో 13 కోట్ల రూపాయలను నిందితులు నకిలీ పత్రాలు సమర్పించి, చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీ సహకారంతో జేబులో వేసుకున్నారు. ఈ విషయాన్ని యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు తెలుగు అకాడమీ ఆఫీసర్లు. ఈ డిపాజిట్ల విషయంలో ఇక ఫైనల్‌ డిసిషన్ యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులదే. అయితే, అకాడమీ మొత్తం డబ్బును తిరిగి ఇచ్చేలా వారు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Read Also…  Cheddi Gang Live Video: దొంగలొస్తున్నారు.. ఇళ్లు భద్రం.. పలుచోట్ల చెడ్డీ గ్యాంగ్ హల్ చల్..(వీడియో)