హిజ్రాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో హిజ్రా వర్గం

|

Oct 12, 2020 | 11:19 PM

హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రెండు హిజ్రా వర్గాల మధ్య గొడవ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది.

హిజ్రాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో హిజ్రా వర్గం
Follow us on

హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రెండు హిజ్రా వర్గాల మధ్య గొడవ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగిన గొడవ కాస్త పెట్రోలు పోసి తగలబెట్టి హతమార్చే స్థితికి వెళ్లింది. మాదాపూర్ పీఎస్ పరిధిలో ఓ హిజ్రాపై మరో హిజ్రా వర్గం పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన హైదరాబాద్‌లో తీవ్ర సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎర్రగడ్డ అవంతి నగర్‌కు చెందిన హరి ప్రసాద్ అలియాస్ హంస (28)కు ఇటీవల చందానగర్‌లో నివాసం ఉంటున్న కొంతమంది హిజ్రాలతో విబేధాలు తలెత్తాయి. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి హైటెక్ రైల్వే‌ స్టేషన్ సమీపంలో మాట్లాడుకుందామని హంసకు సమాచారం అందించారు. హంస ఒక్కతే రావడంతో ఇదే అదునుగా భావించిన మరో వర్గం దాడి చేసింది. అంతేకాదు, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు. ఈ ఘటనలో హంసకు తీవ్రగాయాలయ్యాయి.

మంటల్లో కాలుతున్న హంసను గమనించిన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ హంస ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆస్పత్రిలోనే హంస చికిత్స పొందుతోంది. హంస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.