ఆరుష్ ఏడీ.. రెండు నెలలు దాటినా జాడ ఏది..!

| Edited By:

Aug 29, 2019 | 12:06 PM

రెండు నెలల క్రితం తప్పిపోయిన ఆరుష్ రెడ్డి కిడ్నాప్ వ్యవహారం మిస్టరీగానే ఉంది. జూన్ 24న సాయంత్రం ఇంటి పక్కన పిల్లలతో ఆడుకుంటున్న ఆరుష్ రెడ్డి ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా జాడ లేదు. తల్లిదండ్రులు తమ బాబు ఆచూకీ వెతికిపెట్టండి అంటూ పోలీసుల చుట్టూ.. అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయారు. బాబు తల్లిదండ్రులకు ఎవరితోనూ గొడవలు లేవు. అలాగే పాత కక్షలు కూడా లేవు. మరి బాబును ఎవరు తీసుకెళ్లినట్లు అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. బాలుడి […]

ఆరుష్ ఏడీ.. రెండు నెలలు దాటినా జాడ ఏది..!
Follow us on

రెండు నెలల క్రితం తప్పిపోయిన ఆరుష్ రెడ్డి కిడ్నాప్ వ్యవహారం మిస్టరీగానే ఉంది. జూన్ 24న సాయంత్రం ఇంటి పక్కన పిల్లలతో ఆడుకుంటున్న ఆరుష్ రెడ్డి ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా జాడ లేదు. తల్లిదండ్రులు తమ బాబు ఆచూకీ వెతికిపెట్టండి అంటూ పోలీసుల చుట్టూ.. అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయారు. బాబు తల్లిదండ్రులకు ఎవరితోనూ గొడవలు లేవు. అలాగే పాత కక్షలు కూడా లేవు. మరి బాబును ఎవరు తీసుకెళ్లినట్లు అనేది ప్రశ్నగా మిగిలిపోయింది.

బాలుడి అపహరణ వెనుక బెగ్గర్స్‌ మాఫియా ఉందా..? లేక గుప్త నిధుల తవ్వకాల్లో బలిచ్చేందుకు ఎత్తుకెళ్లారా…? ఇంకా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారించినా ఫలితం లేకుండా పోయింది. దర్శి డీఎప్సీ నేతృత్వంలో ఇద్దరు సిఐలు.. నలుగురు ఎస్సైలు బృందాలుగా ఏర్పడి మరి విచారణ చేపట్టారు. పాత నేరస్థులను కూడా విచారించారు. అయినప్పటికీ అరుష్ రెడ్డి ఆచూకీ తెలియలేదు. వీలైనంత త్వరగా తమ బాబు జాడను తెలిసేలా చేయమని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.