పుట్టగొడుగుల వివాదం: వైసీపీ కార్యకర్త మృతి

| Edited By:

Oct 16, 2019 | 9:22 AM

ఏపీలో ఎన్నికలు పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా.. రాజీయ కక్షలు మాత్రం ఆగడంలేదు. అధికార, ప్రతిపక్ష కార్యకర్తలు పిట్టల్లా రాలిపోతున్నారు. దాడులు, ప్రతి దాడులతో గ్రామాలు, దద్దరిల్లుతున్నాయి. ఇక్కడా.. అక్కడా అన్న తేడా లేదు. అనంతపురం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లా వరకు పొలిటికల్‌ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కుంటిభద్రలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తను దారుణంగా హత్య […]

పుట్టగొడుగుల వివాదం: వైసీపీ కార్యకర్త మృతి
Follow us on

ఏపీలో ఎన్నికలు పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా.. రాజీయ కక్షలు మాత్రం ఆగడంలేదు. అధికార, ప్రతిపక్ష కార్యకర్తలు పిట్టల్లా రాలిపోతున్నారు. దాడులు, ప్రతి దాడులతో గ్రామాలు, దద్దరిల్లుతున్నాయి. ఇక్కడా.. అక్కడా అన్న తేడా లేదు. అనంతపురం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లా వరకు పొలిటికల్‌ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కుంటిభద్రలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. స్థానికంగా చోటుచేసుకున్న స్వల్ప వివాదాన్ని దృష్టిలో ఉంచుకున్న టీడీపీ కార్యకర్తలు బల్లెంతో పొడిచి జంగం అనే వ్యక్తిని అత్యంత కిరాతంగా హత్యచేశారు. ఈ దాడిలో మరో నలుగురు YCP కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. కొత్తూరు మండలం కుంటిబద్రలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య పుట్టగొడుగుల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాలకు చెందిన వాళ్లు బల్లెలు, కర్రలతో ఒకరిపై మరికొరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో వైసీపీ కార్యకర్త జంగం మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కుంటిభద్రలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. అల్లర్లు జరగకుండా చూసేందుకు 144 సెక్షన్ విధించారు. జిల్లాలో జరిగిన ఘటనపై వైసీపీ సీరియస్‌గా ఉంది. ఇరువర్గాల ఘర్షణలో వైసీపీ కార్యకర్త చనిపోవడంపై ఆపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీతో మాట్లాడారు. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు.