మద్యప్రదేశ్‌లో కరోనాతో ఓ యువ వైద్యుడు మ‌ృతి.. బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీలో ఘటన..

|

Nov 26, 2020 | 12:15 PM

కరోనాతో ఓ యువ వైద్యుడు మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీలో జరిగింది. కరోనా రోగులకు వైద్యం చేసే క్రమంలో కొవిడ్ భారిన పడిన డాక్టర్ శుభం ఉపాధ్యాయ నెల రోజుల పాటు పోరాడి బుధవారం మ‌ృతి చెందాడు.

మద్యప్రదేశ్‌లో కరోనాతో ఓ యువ వైద్యుడు మ‌ృతి.. బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీలో ఘటన..
Follow us on

కరోనాతో ఓ యువ వైద్యుడు మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీలో జరిగింది. కరోనా రోగులకు వైద్యం చేసే క్రమంలో కొవిడ్ భారిన పడిన డాక్టర్ శుభం ఉపాధ్యాయ నెల రోజుల పాటు పోరాడి బుధవారం మ‌ృతి చెందాడు. ఈ ఘటనతో ఆస్పత్రిలో వైద్య సిబ్బంది మొత్తం భయం భయంతో ఉద్యోగం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీలో శుభం ఉపాధ్యాయ్ కాంట్రాక్ట్ డాక్టర్‌గా పని చేస్తున్నారు. కొవిడ్ పేషేంట్లకు చికిత్స అందిస్తున్న క్రమంలో ఇటీవల అతడికి కరోనా సోకింది. దీంతో సిబ్బంది బోపాల్‌లోని చిరాయు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందించగా ఈ నెల 10న ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఊపిరితిత్తులు చెడిపోవడంతో అవయవమార్పిడి చేయాలని డాక్టర్లు తెలిపారు. ఇందుకోసం చెన్నై తరలించాలని భావించగా నివర్ తుఫాన్ కారణంగా అది కుదరలేదు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించి వెంటనే అతడికి చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే శుభం మ‌ృతి చెందాడు. దీంతో ఓ కొవిడ్ వారియర్‌ను కోల్పోయామంటూ ఆస్పత్రి సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు. నివర్ తుఫాన్ లేకుంటే శుభంను కాపాడుకునే వాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అతడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి, అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు.