Mobile Games: మొబైల్ లో ఆడుకోవద్దని మందలించినందుకు ఆత్మహత్య చేసుకున్న బాలుడు

|

Apr 02, 2021 | 11:46 AM

మొబైల్ గేమ్స్ పిల్లలపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మొబైల్ లో ఆడుకోవడం అలవాటైన పిల్లల ప్రవర్తనలో విపరీత పోకడలు పెరిగిపోతున్నాయి.

Mobile Games: మొబైల్ లో ఆడుకోవద్దని మందలించినందుకు ఆత్మహత్య చేసుకున్న బాలుడు
Boy On Mobile Game
Follow us on

Mobile Games: మొబైల్ గేమ్స్ పిల్లలపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మొబైల్ లో ఆడుకోవడం అలవాటైన పిల్లల ప్రవర్తనలో విపరీత పోకడలు పెరిగిపోతున్నాయి. మొబైల్ గేమ్స్ ఆడే చిన్నారులు తమ అలవాటు మానమని ఎవరు చెప్పినా వినే పరిస్థితిని దాటిపోతున్నారు.
తాజాగా, నోయిడాలో జరిగిన ఓ సంఘటన మొబైల్ గేమ్స్ తో వచ్చే అనర్ధాలకు ప్రతీకగా నిలిచింది. తల్లిదండ్రులు మొబైల్ గేమ్స్ ఆడొద్దని మందలించినందుకు నొయిడాకు చెందిన 15 ఏళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నోయిడా లోని సెక్టార్ 110, ఫేజ్ 2 పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన దాని ప్రకారం ఇలా ఉన్నాయి.

నోయిడాలో ఏడో తరగతి చదువుతున్న బాలుడు రాత్రి 8 అయినా మొబైల్ లో గేమ్స్ ఆడటం ఆపలేదు. దీంతో అతని తల్లిదండ్రులు మందలించారు. ఇది జరిగిన కొద్దిసేపటి తరువాత ఆ బాలుడు ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరునాడు ఉదయం ఆ బాలుడు కనిపించకుండా పోయిన ప్రదేశానికి కొద్దిగా దగ్గరలో నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర అతని మృత దేహం కనిపించింది. తల్లిదండ్రులు మందలించారనే కోపంతో బాలుడు ఆ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. బాలుని మృతదేహాన్ని పోస్టుమార్టం చేయడానికి తరలించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా నోయిడాలోని సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రెండు ఆత్మహత్య కేసులు నమోదు అయినట్టు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న 22 సంవత్సరాల యువకుడు, గ్రేటర్ నోయిడా బిస్రాఖ్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నటు తెలిపారు. వీరిద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Also Read: Hyderabad: దారుణ హత్య.. శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఎక్కడంటే..?

నకిలీ పోలీసుల భాగోతం బయటపెట్టిన పోలీసులు..ఆరుగురు అరెస్టు.. భారీగా బంగారం, నగదు వాహనాలు స్వాధీనం