‘మా నగరానికి రాకండి ప్లీజ్’.. టూరిస్టులకు అమెరికన్ సిటీ రిక్వెస్ట్

| Edited By: Pardhasaradhi Peri

Apr 04, 2020 | 5:45 PM

ఈ నగరంలోని టూరిస్టు స్పాట్ ల వద్ద పార్క్ చేసి ఉన్నాయి. రోజు రోజుకీ టూరిస్టుల తాకిడి పెరుగుతోంది. మార్చి మాసాంతానికి ఏ నగరంలో 370 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా రోగులు మరణించారు. కానీ బయటి ప్రాంతాలనుంచి వస్తున్నవారు ఇదేమీ పట్టించుకోవడంలేదు.

మా నగరానికి రాకండి ప్లీజ్.. టూరిస్టులకు అమెరికన్ సిటీ రిక్వెస్ట్
Follow us on

అమెరికాలోని న్యూ హాంప్ షైర్ ప్రస్తుతం వసంతకాలంతో అలరారుతోంది. పగలు ఓ వైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా.. సాయంత్రమయ్యేసరికి చల్లని పిల్ల గాలులతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతోంది. దీంతో వేలాది టూరిస్టులు ‘చలో హాంప్ షైర్’ అంటూ బస్సులు, కార్లు ఎక్కేస్తున్నారు. అయితే కరోనా ముప్పు పొంచి ఉంది.. దయచేసి రావద్దని అక్కడి అధికారులు కోరుతున్నారు. ‘డోంట్ కమ్ టు హాంప్ షైర్’ అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడికి వస్తున్న విజిటర్లు, టూరిస్టుల్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉంటే ఆ రోగం తమకూ అంటుకుంటుందని వీరు భయపడుతున్నారు . ఒకవేళ మా సిటీ న్యూయార్క్ కన్నా అధ్వాన్నంగా మారుతుందేమో.. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి అని హాంప్ షైర్ స్థానికులు కూడా కోరుతున్నారు. అయితే ఇప్పటికే స్టేట్ లైసెన్స్  లేని వందలాది కార్లు, ఇతర వాహనాలు ఈ నగరంలోని టూరిస్టు స్పాట్ ల వద్ద పార్క్ చేసి ఉన్నాయి. రోజు రోజుకీ టూరిస్టుల తాకిడి పెరుగుతోంది. మార్చి మాసాంతానికి ఏ నగరంలో 370 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా రోగులు మరణించారు. కానీ బయటి ప్రాంతాలనుంచి వస్తున్నవారు ఇదేమీ పట్టించుకోవడంలేదు.