ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

| Edited By: Pardhasaradhi Peri

Apr 10, 2020 | 4:50 PM

కరోనా వ్యాధి నుంచి కొంతవరకు కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేశారు. అయితే ఆయన ఆసుపత్రిలో మరికొంతకాలం చికిత్స పొందాల్సి ఉంటుంది.

ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Follow us on

కరోనా వ్యాధి నుంచి కొంతవరకు కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేశారు. అయితే ఆయన ఆసుపత్రిలో మరికొంతకాలం చికిత్స పొందాల్సి ఉంటుంది. ఆయన ఉల్లాసంగా ఉన్నారని, ఏమైనప్పటికీ వైద్యసిబ్బంది ప్రతి క్షణం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. జాన్సన్ ను జనరల్ వార్డు లోకి షిఫ్ట్ చేయగానే ఆయన తన భాగస్వామి కేరీ సైమండ్స్ కు, తన సన్నిహిత కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ చేశారు. కాగా బోరిస్ జాన్సన్ తిరిగి ఎప్పటి నుంచి ప్రధానిగా పాలనా బాధ్యతలు స్వీకరిస్తారన్నది తెలియడంలేదు. పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోవడానికి ఆయనకు నెల రోజులుపైగానే పట్టవచ్ఛునని డాక్టర్లు తెలిపారు. తమ దేశాధినేత కరోనా నుంచి కోలుకున్నారని తెలియగానే.. బ్రిటన్ వాసులు హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు.