లండన్.. నేషనల్ సెల్యూట్.. ఆ హెల్త్ వర్కర్స్ కి వెల్లువెత్తిన వందనాలు

| Edited By: Pardhasaradhi Peri

Apr 17, 2020 | 5:03 PM

బ్రిటన్ లో కరోనా వైరస్ రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లను అభినందిస్తూ.. లక్షలాది మంది వీదుల్లోకి వఛ్చి చప్పట్లతో తమ సంఘీభావాన్ని తెలిపారు. వీరిలో పిల్లలు, పోలీసులు, కార్మికులు కూడా ఉన్నారు. నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన సిబ్బందిలో సుమారు 45 మంది ఇన్ఫెక్షన్స్ కారణంగా మృతి చెందారు. వారిని తలచుకుని వారి కుటుంబీకులు కూడా కన్నీటి పర్యంతమవుతూనే బాల్కనీల్లో నిలబడి చప్పట్లు కొట్టారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి, డొమినిక్ రాబ్, భారత సంతతి […]

లండన్.. నేషనల్ సెల్యూట్.. ఆ హెల్త్ వర్కర్స్ కి వెల్లువెత్తిన వందనాలు
Follow us on

బ్రిటన్ లో కరోనా వైరస్ రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లను అభినందిస్తూ.. లక్షలాది మంది వీదుల్లోకి వఛ్చి చప్పట్లతో తమ సంఘీభావాన్ని తెలిపారు. వీరిలో పిల్లలు, పోలీసులు, కార్మికులు కూడా ఉన్నారు. నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన సిబ్బందిలో సుమారు 45 మంది ఇన్ఫెక్షన్స్ కారణంగా మృతి చెందారు. వారిని తలచుకుని వారి కుటుంబీకులు కూడా కన్నీటి పర్యంతమవుతూనే బాల్కనీల్లో నిలబడి చప్పట్లు కొట్టారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి, డొమినిక్ రాబ్, భారత సంతతి మంత్రి రిషి సునక్ సైతం తమ కార్యాలయాల వద్ద నిలబడి ఇలా సంఘీభావం తెలిపారు. కాగా-దేశంలో  103,093 కరోనా కేసులు నమోదు కాగా.. సుమారు 14 వేల మంది రోగులు మృతి చెందారు. దేశంలో మూడు వారాల పాటు లాక్ డౌన్ విధించారు. అయితే చాలామంది ఈ ఆంక్షలను పట్టించుకోకపోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించింది.

 

ప్రపంచ వ్యాప్తంగా కంఫామ్ అయిన కరోనా  కేసులు 21  లక్షలకు పైగా చేరుకున్నాయి. లక్షా 43 వేల మంది మృత్యు బాట పట్టారు. దాదాపు అయిదు లక్షల మంది కోలుకున్నారు.