కరోనాపై తప్పుడు ప్రచారం.. ట్రంప్ వీడియోను తొలగించిన ట్విటర్

| Edited By: Pardhasaradhi Peri

Jul 29, 2020 | 5:01 PM

కరోనా వైరస్ పై తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన వీడియో తాలూకు పోస్టును ట్విటర్ తొలగించింది. ఈ ట్వీట్లు..కరోనాపై తప్పుడు సమాచారాన్ని అందించరాదన్న తమ పాలసీకి విరుధ్దమని ప్రకటించింది. ఫేస్ బుక్ సైతంఇదే మార్గాన్ని అనుసరించింది. కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు ఫేస్ మాస్కులు, లాక్ డౌన్ లు అవసరం లేదని కొందరు డాక్టర్ల బృందం చేస్తున్న సూచన ఈ వీడియోలో ఉంది. అలాగే కోవిడ్-19 చికిత్సకు అంతగా పనికిరాదని ప్రూవ్ అయిన […]

కరోనాపై తప్పుడు ప్రచారం.. ట్రంప్ వీడియోను తొలగించిన ట్విటర్
Follow us on

కరోనా వైరస్ పై తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన వీడియో తాలూకు పోస్టును ట్విటర్ తొలగించింది. ఈ ట్వీట్లు..కరోనాపై తప్పుడు సమాచారాన్ని అందించరాదన్న తమ పాలసీకి విరుధ్దమని ప్రకటించింది. ఫేస్ బుక్ సైతంఇదే మార్గాన్ని అనుసరించింది. కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు ఫేస్ మాస్కులు, లాక్ డౌన్ లు అవసరం లేదని కొందరు డాక్టర్ల బృందం చేస్తున్న సూచన ఈ వీడియోలో ఉంది. అలాగే కోవిడ్-19 చికిత్సకు అంతగా పనికిరాదని ప్రూవ్ అయిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును వినియోగించవచ్ఛునని కూడా ఆ డాక్టర్లు చెప్పారు. ఫేస్ బుక్ నుంచి ఈ వీడియోను తొలగించే ముందే దీన్ని లక్షలాది మంది చూసేశారు. అయితే ట్రంప్ చేతులు ముడుచుకుని కూర్చోలేదు.  ఈ వీడియోను ఆయన తన 84 మంది ఫాలోవర్లకు రీట్వీట్ చేశారు.