‘గుడులూ, గోపురాలూ ఎప్పుడు తెరుద్దాం’ ? మహారాష్ట్ర గవర్నర్

| Edited By: Pardhasaradhi Peri

Oct 13, 2020 | 2:53 PM

రాష్ట్రంలో గుడులూ, గోపురాలూ, ప్రార్థనా మందిరాలూ ఎప్పుడు తెరవాలన్నదానిపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ, సీఎం ఉద్ధవ్ థాక్రే మధ్య ఆసక్తికరమైన కమ్యూనికేషన్ జరిగింది. కోవిడ్ ముందుజాగ్రత్త చర్యలతో వీటిని వెంటనే తెరిచే అవకాశాన్ని పరిశీలించవలసిందిగా కోష్యారీ..ఆయనకు లేఖ రాశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీరు అయోధ్యను సందర్శించి రాముడిమీద మీ భక్తిని చాటుకున్నారని, పండరీపురంలో ఆషాఢ ఏకాదశి నాడు విఠల్ రుక్మిణి మందిరాన్ని దర్శించి పూజలు కూడా చేశారని ఆయన ఈ లేఖలో […]

గుడులూ, గోపురాలూ ఎప్పుడు తెరుద్దాం ? మహారాష్ట్ర గవర్నర్
Follow us on

రాష్ట్రంలో గుడులూ, గోపురాలూ, ప్రార్థనా మందిరాలూ ఎప్పుడు తెరవాలన్నదానిపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ, సీఎం ఉద్ధవ్ థాక్రే మధ్య ఆసక్తికరమైన కమ్యూనికేషన్ జరిగింది. కోవిడ్ ముందుజాగ్రత్త చర్యలతో వీటిని వెంటనే తెరిచే అవకాశాన్ని పరిశీలించవలసిందిగా కోష్యారీ..ఆయనకు లేఖ రాశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీరు అయోధ్యను సందర్శించి రాముడిమీద మీ భక్తిని చాటుకున్నారని, పండరీపురంలో ఆషాఢ ఏకాదశి నాడు విఠల్ రుక్మిణి మందిరాన్ని దర్శించి పూజలు కూడా చేశారని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు గుడులను, ప్రార్థనా మందిరాలను రీఓపెన్ చేసే విషయాన్ని వాయిదా వేస్తున్నారని, సెక్యులర్ గా మారిపోయారా అని కూడా ప్రశ్నించారు. కరోనా వైరస్ ఉన్నప్పటికీ గత జూన్ లోనే దేశంలో అనేకచోట్ల గుడులు, గోపురాలు తెరిచారన్నారు. ఈ లేసుఖపై స్పందించిన ఉధ్ధవ్.. తన హిందుత్వపై ఎవరి నుంచీ తనకు సర్టిఫికెట్ అవసరం లేదని, అన్ని అంశాలూ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.