శానిటైజర్లను అతిగా వాడినా ప్రమాదమే…నిపుణుల హెచ్చరిక

| Edited By: Pardhasaradhi Peri

Jul 25, 2020 | 4:07 PM

ఈ కరోనా కాలంలో హ్యాండ్ శానిటైజర్లను అతిగా వాడినా ప్రమాదమే అని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. కరోనా భయంతో మాటిమాటికీ అదేపనిగా ఈ లిక్విడ్ ని చేతులకు రాసుకుంటూ ఉంటే..

శానిటైజర్లను అతిగా వాడినా ప్రమాదమే...నిపుణుల హెచ్చరిక
Follow us on

ఈ కరోనా కాలంలో హ్యాండ్ శానిటైజర్లను అతిగా వాడినా ప్రమాదమే అని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. కరోనా భయంతో మాటిమాటికీ అదేపనిగా ఈ లిక్విడ్ ని చేతులకు రాసుకుంటూ ఉంటే..చేతులు పొడిబారతాయని,  దద్దుర్లు ఏర్పడతాయని, ఒక్కోసారి చేతులనుంచి రక్తం కారవచ్ఛునని వారు అంటున్నారు. సాధారణంగా ఆల్కహాలుతో కూడిన శానిటైజర్ బ్యాక్టీరియాను నియంత్రిస్తుందని, కరోనా వైరస్ వ్యాప్తిని నివారిస్తుందని డాక్టర్లు ప్రకటిస్తున్నా.. మరీ ఎక్కువగా దీని వినియోగం మంచిది కాదని ఢిల్లీలోని  డెర్మటాలజిస్టులు, ఇతర నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆల్కహాలు లేని శానిటైజర్ కూడా మంచిదేనని, ఏమైనప్పటికీ ఎక్కువగా వాడడం మాత్రం తగదని వీరు పేర్కొంటున్నారు. పరిమిత వినియోగమే బెస్ట్ అన్నది వీరి సూచన.