రెండో విడత ‘వందే భారత్ మిషన్’ లో…..

| Edited By: Pardhasaradhi Peri

May 12, 2020 | 6:31 PM

రెండో విడత ‘వందే భారత్ మిషన్’ లో భాగంగా ఈ నెల 16 నుంచి 22 వరకు 31 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తరలించనున్నారు. ఇందుకు 149 విమానాలను రంగంలోకి దించనున్నారు. వీటిలో ఫీడర్ విమానాలు కూడా ఉంటాయి. మొదట అమెరికాకు 13, బ్రిటన్ కు 9, కెనడాకు 10, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి 11, సౌదీ అరేబియాకు 9, రష్యాకు 6, ఆస్ట్రేలియాకు 7 విమానాలు నడుస్తాయి. ఇంకా ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, […]

రెండో విడత వందే భారత్ మిషన్ లో.....
Follow us on

రెండో విడత ‘వందే భారత్ మిషన్’ లో భాగంగా ఈ నెల 16 నుంచి 22 వరకు 31 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తరలించనున్నారు. ఇందుకు 149 విమానాలను రంగంలోకి దించనున్నారు. వీటిలో ఫీడర్ విమానాలు కూడా ఉంటాయి. మొదట అమెరికాకు 13, బ్రిటన్ కు 9, కెనడాకు 10, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి 11, సౌదీ అరేబియాకు 9, రష్యాకు 6, ఆస్ట్రేలియాకు 7 విమానాలు నడుస్తాయి. ఇంకా ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఐర్లండ్, ఇతర గల్ఫ్ దేశాలకు కూడా విమానాలు ఎగురుతాయి. పొరుగునున్న బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు ఒక్కొక్కటి చొప్పున నడుపుతారు. ఈ నెల మధ్య వారానికల్లా రెండు లక్షల మంది, జూన్ రెండో వారానికల్లా దాదాపు నాలుగు లక్షల మంది భారతీయులు స్వదేశానికి తరలి రానున్నారు. రెండు దశల్లో ఈ ‘మిషన్’ ఉంటుందని భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.