డాక్టర్ల భద్రత ప్రభుత్వ బాధ్యత.. అమిత్ షా

| Edited By: Pardhasaradhi Peri

Apr 22, 2020 | 3:37 PM

దేశంలోని ఆస్పత్రుల్లో రోగులకు సేవలందిస్తున్న డాక్టర్ల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ఇందులో మరో ఆలోచనకు తావు లేదని హోం మంత్రి అమిత్ షా అన్నారు. బుధవారం కొందరు  డాక్టర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ ఎం ఏ) ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటరాక్ట్ అయిన ఆయన.. ముఖ్యంగా కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్న వైద్యులు, హెల్త్ కేర్ వర్కర్లపై దాడులను ఉపేక్షించేది లేదన్నారు. వారికి పూర్తి భద్రత ఉంటుందన్నారు. వీరికి రక్షణ కల్పించాలంటూ.. ఇండియన్ […]

డాక్టర్ల భద్రత ప్రభుత్వ బాధ్యత.. అమిత్ షా
Follow us on

దేశంలోని ఆస్పత్రుల్లో రోగులకు సేవలందిస్తున్న డాక్టర్ల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ఇందులో మరో ఆలోచనకు తావు లేదని హోం మంత్రి అమిత్ షా అన్నారు. బుధవారం కొందరు  డాక్టర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ ఎం ఏ) ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటరాక్ట్ అయిన ఆయన.. ముఖ్యంగా కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్న వైద్యులు, హెల్త్ కేర్ వర్కర్లపై దాడులను ఉపేక్షించేది లేదన్నారు. వారికి పూర్తి భద్రత ఉంటుందన్నారు. వీరికి రక్షణ కల్పించాలంటూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేపట్టదలచిన నిరసనను విరమించుకోవాలని ఆయన కోరారు. దేశంలోని వివిధ చోట్ల కరోనా రోగుల చికిత్సలో ఉన్న వైద్య సిబ్బంది మీద జరుగుతున్న దాడులను ఈ సంస్థ ప్రతినిధులు హోం మంత్రి దృష్టికి తెచ్చారు. అయితే ప్రభుత్వం మీ వైపే ఉందని, ఎలాంటి ఆందోళనకూ దిగరాదని అమిత్ షా కోరారు. ఈ దశలో ఈ విధమైన యోచన మంచిది కాదని పేర్కొన్నారు.  ఈ తరుణంలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు అమోఘమైనవని, ప్రతి భారతీయుడూ వారికి సహకరించాలని ఆయన ఆ తరువాత ట్వీట్ చేశారు.