రష్యాలో తగ్గుతున్న కరోనా కేసులు..!

| Edited By:

Jul 23, 2020 | 5:26 PM

రష్యాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టమవుతోంది. గడిచిన వారం రోజులుగా రష్యా వ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా..

రష్యాలో తగ్గుతున్న కరోనా కేసులు..!
Follow us on

రష్యాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టమవుతోంది. గడిచిన వారం రోజులుగా రష్యా వ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా కొత్తగా 5,848 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు మూడు నాలుగు రోజులు కూడా 5 వేల నుంచి 6 వేల మధ్యలోనే నమోదయ్యాయి. అంతకుముందు ఈ సంఖ్య ఏడు నుంచి తొమ్మిది వేల మధ్య ఉండేది.

తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులతో రష్యా వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,95,038కి చేరింది. దేశంలోని 83 ప్రాంతంలో 5,848 కేసులు నమోదయ్యాయని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మాస్కోలో అత్యధికంగా 608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఆ తర్వాత స్వెర్డ్‌లోవస్క్‌ రీజియన్‌లో 249, నిజ్నీ నోవ్‌గోర్డ్‌ రీజియన్‌లో 202 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రస్తుతం రష్యా వ్యాప్తంగా 2.67 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు కరోనా నుంచి 5.8 లక్షల మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే రోజురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం చూస్తే వైరస్ బలహీనపడిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.