‘వెంటిలేటర్లు తీసేయండి.. వాళ్ళను చంపేయండి’.. బ్రిటన్ డాక్టర్లకు గైడ్ లైన్స్

| Edited By: Pardhasaradhi Peri

Apr 02, 2020 | 5:57 PM

ఇదిలా ఉండగా లండన్ లోని చాలా ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత తీవ్రమైంది. ఓ ప్రముఖ ఆసుపత్రిలో పని చేస్తున్న 73 మందికి కరోనా పాజిటివ్ సోకింది.

వెంటిలేటర్లు తీసేయండి.. వాళ్ళను చంపేయండి.. బ్రిటన్ డాక్టర్లకు గైడ్ లైన్స్
Follow us on

కరోనాకు గురై.. ఇక బతికే అవకాశం లేని వృధ్ద రోగులకు వెంటిలేటర్లను తొలగించాలని బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్.. డాక్టర్లకు సూచించింది. ఆ వెంటిలేటర్లను వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఉన్న మధ్య వయస్సువారికో, యువ రోగులకో అమర్చాలని ఈ సంస్థ మార్గదర్శకాలను జారీ చేసింది. ఎవరికి చికిత్స చేస్తే బతికే అవకాశం ఉందో, ఎవరికి లేదో నిర్ధారించుకోవలసిన బాధ్యత మీదేనని, ఆ హక్కు మీకు ఉందని కూడా ఈ సంస్థ పేర్కొంది. మంచం పట్టిన వృధ్ద రోగుల ఆరోగ్యం మెరుగు పడే స్థితిలో ఉన్నప్పటికీ.. దాన్ని పట్టించుకోకుండా వెంటిలేటర్లను తీసేయాలని కోరింది. అయితే ఇది చట్ట విరుధ్దమని, దారుణమని, డాక్టర్ల సంఘం విమర్శించింది. కానీ ప్రస్తుత అనివార్య పరిస్థితుల్లో మరో గత్యంతరం లేదని కూడా కొందరు డాక్టర్లు అభిప్రాయపడ్డారు. ఏమైనా వయస్సు మళ్లినవారిపట్ల ఇది వివక్ష చూపడమేనని మరికొంతమంది ఈసడించుకున్నారు.

ఇదిలా ఉండగా లండన్ లోని చాలా ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత తీవ్రమైంది. ఓ ప్రముఖ ఆసుపత్రిలో పని చేస్తున్న 73 మందికి కరోనా పాజిటివ్ సోకింది. ఈ హాస్పిటల్ లో ని 318 మంది స్టాఫ్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారని, దీంతో డాక్టర్లు లేదా నర్సుల కొరత తీవ్రంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బ్రిటన్ లో 29 వేల మందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. 2,300 మందికి పైగా కరోనా రోగులు మరణించారు.