కరోనాపై పోరు జరిపే డాక్టర్లపై దాడి చేస్తే 5 ఏళ్ళ జైలు శిక్ష, బిల్లుకు ఆమోదం

| Edited By: Pardhasaradhi Peri

Sep 19, 2020 | 8:18 PM

కరోనా వైరస్ పై పోరు జరుపుతూ నిరంతరం రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లపై దాడికి పాల్పడేవారికి 5 ఏళ్ళ జైలు శిక్ష విధించడానికి ఉద్దేశించిన 'ఎపిడెమిక్ వ్యాధుల సవరణ బిల్లు'కు రాజ్య సభ ఆమోదం తెలిపింది..

కరోనాపై పోరు జరిపే డాక్టర్లపై దాడి చేస్తే  5 ఏళ్ళ జైలు శిక్ష, బిల్లుకు ఆమోదం
Follow us on

కరోనా వైరస్ పై పోరు జరుపుతూ నిరంతరం రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లపై దాడికి పాల్పడేవారికి 5 ఏళ్ళ జైలు శిక్ష విధించడానికి ఉద్దేశించిన ‘ఎపిడెమిక్ వ్యాధుల సవరణ బిల్లు’కు రాజ్య సభ ఆమోదం తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతమున్న ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ను సవరించి ఈ బిల్లును రూపొందించారు. డాక్టర్లు, హెల్త్ వర్కర్ల ఆస్తులకు నష్టం కలిగించేవారు కూడా శిక్షార్హులే అని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. దేశంలో పలు చోట్ల రోగుల బంధువులు కరోనా వారియర్లపై తరచూ దాడులు జరపడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. అందువల్లే ఈ సవరణ బిల్లును తెచ్చినట్టు మంత్రి వివరించారు.