రఫేల్ జెట్ విమానాలొస్తున్నాయ్.. రాజ్ నాథ్ సింగ్

| Edited By: Pardhasaradhi Peri

Jun 02, 2020 | 5:07 PM

కరోనా వైరస్ ప్రబలంగా ఉన్నప్పటికీ,, మనకు రఫేల్ జెట్ విమానాలను సకాలంలో అందజేస్తామని ఫ్రాన్స్ ప్రకటించిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి..

రఫేల్ జెట్ విమానాలొస్తున్నాయ్.. రాజ్ నాథ్ సింగ్
Follow us on

కరోనా వైరస్ ప్రబలంగా ఉన్నప్పటికీ,, మనకు రఫేల్ జెట్ విమానాలను సకాలంలో అందజేస్తామని ఫ్రాన్స్ ప్రకటించిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఫ్లారెన్స్ పార్లెతో తాను ఫోన్ లో మాట్లాడానని, ఈ విమానాలను పంపడానికి కొంతవరకు కరోనా క్రైసిస్ కారణమని ఆయన అభిప్రాయపడ్డారని రాజ్ నాథ్ చెప్పారు. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితితో సహా ప్రాంతీయ భద్రత తదితర అంశాలపై ఉభయ దేశాలూ సహకరించుకోవాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. 4 రఫేల్ విమానాలు గత మే నెలలోనే ఇండియాకు చేరవలసి ఉందని, కానీ ఇవి జులై  నెలాఖరుకు మనకు చేరుతాయని ఆయన వివరించారు. పాకిస్తాన్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న దృష్ట్యా.. భారత వైమానిక దళం ఈ విమానాలను వచ్ఛే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఫ్రాన్స్ నుంచి ఇండియా రూ. 59 వేల కోట్లతో 36 రఫేల్ జెట్ ప్లేన్లను కొనుగోలు చేసింది.