‘పిట్ట కొంచెం.. కూత ఘనం’.. కరోనాను ‘తరిమి కొట్టిన’ రెండు చిన్న దేశాలు

| Edited By: Pardhasaradhi Peri

May 06, 2020 | 12:27 PM

అవి రెండూ చిన్న దేశాలే ! పైగా ధనిక దేశాలు కూడా !ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా బీభత్సంతో తల్లడిల్లుతుండగా.. మరోవైపు ఈ దేశాలు మాత్రం ‘కరోనా..క్యా కరేగా’ అంటూ ఈ వైరస్ ని తరిమికొడుతున్నాయి.  అవే ఖతార్, సింగపూర్ దేశాలు ! ఖతార్ లో మరణాల రేటు 0.07 ఉండగా.. సింగపూర్ లో ఇది 0.93 శాతం ఉంది. ఖతార్ లో 16 వేల కరోనా కేసులకు గాను 12 మంది రోగులు మృతి […]

పిట్ట కొంచెం.. కూత ఘనం.. కరోనాను తరిమి కొట్టిన రెండు చిన్న దేశాలు
Follow us on

అవి రెండూ చిన్న దేశాలే ! పైగా ధనిక దేశాలు కూడా !ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా బీభత్సంతో తల్లడిల్లుతుండగా.. మరోవైపు ఈ దేశాలు మాత్రం ‘కరోనా..క్యా కరేగా’ అంటూ ఈ వైరస్ ని తరిమికొడుతున్నాయి.  అవే ఖతార్, సింగపూర్ దేశాలు ! ఖతార్ లో మరణాల రేటు 0.07 ఉండగా.. సింగపూర్ లో ఇది 0.93 శాతం ఉంది. ఖతార్ లో 16 వేల కరోనా కేసులకు గాను 12 మంది రోగులు మృతి చెందారు. సింగపూర్ లో 19 వేల ఇన్ఫెక్షన్లు నమోదు కాగా.. 102 ఏళ్ళ ఓ వృధ్ధురాలు సైతం కరోనాను జయించి.. పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఈ దేశంలో ఇన్ఫెక్షన్లు 0.1 శాతం కన్నా తక్కువేనట.

ఈ రెండు దేశాల్లో హెల్త్ కేర్ సిస్టం అద్భుతంగా ఉండడం, టెస్టింగ్ . ప్రజల ఆహారపు అలవాట్లు, వారి వయస్సు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కెపాసిటీ, హాస్పిటల్ సౌకర్యాలు ఇతర దేశాలకన్నా అత్యంత మెరుగ్గా ఉండడమే ఇందుకు కారణమని న్యూ సౌత్ వేల్స్ లోని గ్లోబల్ సెక్యూరిటీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. చిన్నవే అయినా రెండూ ధనిక దేశాలు కావడం, పర్యావరణం పరంగా ఇతర దేశాలకన్నాబెటర్ గా ఉండడం కూడా వీటికి కలిసోచ్చాయి.