ఇక ఢిల్లీలో త్వరలో ప్లాస్మా థెరపీ ట్రయల్స్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్

| Edited By: Pardhasaradhi Peri

Apr 16, 2020 | 8:19 PM

కరోనా సోకి తీవ్ర విషమ స్థితిలో ఉన్న రోగులకు ప్లాస్మా థెరపీ చికిత్స చేసేందుకు అనువుగా వీటి క్లినికల్ ట్రయల్స్ ను త్వరలో ప్రారంభించనున్నారు. ఇందుకు కేంద్రం అనుమతించిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కేవలం వెంటిలేటర్ సపోర్టుపై ఉండి.. ఇక మరణం అంచుల్లో ఉన్న రోగులకు మాత్రమే ఈ తరహా చికిత్స చేస్తారు. అయితే ఇందుకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి నుంచి రక్తాన్ని సేకరించవలసి ఉంటుంది. ఆ బ్లడ్ లోని యాంటీ బాడీస్.. […]

ఇక ఢిల్లీలో త్వరలో ప్లాస్మా థెరపీ ట్రయల్స్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్
Follow us on

కరోనా సోకి తీవ్ర విషమ స్థితిలో ఉన్న రోగులకు ప్లాస్మా థెరపీ చికిత్స చేసేందుకు అనువుగా వీటి క్లినికల్ ట్రయల్స్ ను త్వరలో ప్రారంభించనున్నారు. ఇందుకు కేంద్రం అనుమతించిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కేవలం వెంటిలేటర్ సపోర్టుపై ఉండి.. ఇక మరణం అంచుల్లో ఉన్న రోగులకు మాత్రమే ఈ తరహా చికిత్స చేస్తారు. అయితే ఇందుకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి నుంచి రక్తాన్ని సేకరించవలసి ఉంటుంది. ఆ బ్లడ్ లోని యాంటీ బాడీస్.. కరోనా రోగుల చికిత్సలో ఉపయోగపడుతుందని, వారు కోలుకోగలుగుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్లినికల్ ట్రయల్స్ మరో మూడు, నాలుగు రోజుల్లో ప్రారంభమవుతాయని కేజ్రీవాల్ చెప్పారు. కాగా తమ బ్లడ్ ఇచ్ఛే డోనర్ కు నెగెటివ్ టెస్టింగ్ చేస్తారని, 14 రోజుల ఐసోలేషన్ లో ఉండాల్సి ఉంటుందని, ఎలాంటి పాజిటివ్ లక్షణాలు లేవని తేలాల్సి ఉంటుంది. కాగా ఈ క్లినికల్ ట్రయల్స్ కు డ్రగ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి  ఆమోదం తప్పనిసరి. ఢిల్లీలో 1578 కరోనా కేసులు నమోదు కాగా .. 32 మంది రోగులు మృతి చెందారు. 42 మంది కోలుకున్నారు.