పశ్చిమ బెంగాల్.. మరో వారం రోజులపాటు పాక్షిక లాక్ డౌన్

| Edited By: Pardhasaradhi Peri

Jul 09, 2020 | 5:27 PM

పశ్చిమ బెంగాల్ లోని కంటెయిన్మెంట్ జోన్లలో మరో వారం రోజులపాటు పాక్షిక లాక్ డౌన్ విధించాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఈ చర్య తీసుకున్నట్టు..

పశ్చిమ బెంగాల్.. మరో వారం రోజులపాటు పాక్షిక లాక్ డౌన్
Follow us on

పశ్చిమ బెంగాల్ లోని కంటెయిన్మెంట్ జోన్లలో మరో వారం రోజులపాటు పాక్షిక లాక్ డౌన్ విధించాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఈ చర్య తీసుకున్నట్టు సీఎం మమత వెల్లడించారు. ఈ ఆంక్షలను అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను ఆదేశించారు. ఏడు రోజుల అనంతరం పరిస్థితిని సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ వారం రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన పక్షంలో సడలింపులు ఉంటాయని ఆమె చెప్పారు. బుధవారం ఒక్కరోజే పశ్చిమ బెంగాల్ లో 986 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,823 కి పెరిగింది.