చైనా..చైనా..ప్రపంచ దేశాలకు నరకం చూపిన దేశం… ట్రంప్ మండిపాటు

| Edited By: Pardhasaradhi Peri

Apr 29, 2020 | 3:24 PM

కరోనా వైరస్ మూలాల గురించి తెలియజేయకుండా చైనా చేసిన తప్పిదానికి 184 దేశాలు నరకం అనుభవిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ మండిపడ్డారు. . కంటికి కనబడని ఈ శత్రువుకు కారణం చైనాయేనని మళ్ళీ మళ్ళీ ఆరోపిస్తున్న ఆయన.. దీనిపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామన్నారు. ఆ దేశం నుంచి మరింత ఎక్కువగా పరిహారం కోరుతామని ఆయన చెప్పారు. కరోనా వైరస్ కి కారణం చైనాయేనని  ఆరోపిస్తున్న జర్మనీ సైతం ఆ దేశం నుంచి 140 బిలియన్ డాలర్లను పరిహారంగా కోరుతోంది. […]

చైనా..చైనా..ప్రపంచ దేశాలకు నరకం చూపిన దేశం... ట్రంప్ మండిపాటు
Follow us on

కరోనా వైరస్ మూలాల గురించి తెలియజేయకుండా చైనా చేసిన తప్పిదానికి 184 దేశాలు నరకం అనుభవిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ మండిపడ్డారు. . కంటికి కనబడని ఈ శత్రువుకు కారణం చైనాయేనని మళ్ళీ మళ్ళీ ఆరోపిస్తున్న ఆయన.. దీనిపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామన్నారు. ఆ దేశం నుంచి మరింత ఎక్కువగా పరిహారం కోరుతామని ఆయన చెప్పారు. కరోనా వైరస్ కి కారణం చైనాయేనని  ఆరోపిస్తున్న జర్మనీ సైతం ఆ దేశం నుంచి 140 బిలియన్ డాలర్లను పరిహారంగా కోరుతోంది. అయితే మేం ఇంకా ఎక్కువగా కోరుతామని చెప్పారు ట్రంప్. ఈ మహమ్మారి గురించి ఆ దేశం తొలి దశలోనే అన్ని దేశాలతో సమాచారాన్ని పంచుకుని ఉంటే ఇంత జననష్టం, ఆర్ధిక నష్టం జరగకుండా నివారించి ఉండేవారమని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్, జర్మనీ దేశాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని అన్నారు.  184 దేశాలు నరకాన్ని చవి చూస్తున్నాయని, ఇది అత్యంత దారుణమని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా-ఖనిజాలు, ఇతర పారిశ్రామిక దిగుమతులపై చైనా మీద ఆధారపడరాదని పలువురు అమెరికన్ ఎంపీలు.. ట్రంప్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.