న్యూయార్క్.. కరోనా రోగులకు విటమిన్ ‘సి’తో చికిత్స

| Edited By: Pardhasaradhi Peri

Mar 25, 2020 | 5:58 PM

న్యూయార్క్ లోని ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్సలో భాగంగా విటమిన్ ‘సి’ఇస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు. చైనాలోని వూహాన్ లో గల ఆసుపత్రుల్లోనూ కరోనా వ్యాధిగ్రస్తులకు ఇదే మెడిసిన్ ఇవ్వగా మంచి ఫలితాలనిచ్చిందని ఏండ్రు వెబర్ అనే డాక్టర్ వెల్లడించారు. నార్త్ వెల్త్ హెల్త్ ఆస్పత్రిలో క్రిటికల్ కండిషన్ లో ఐసీయులో ఉన్న పేషంట్లకు 1500 మిల్లీగ్రాముల విటమిన్ సి ఇఛ్చినట్టు ఆయన చెప్పారు. రోజుకు మూడు లేదా నాలుగు సార్లు ఈ టాబ్లెట్స్ ఇస్తున్నామని, వారి ఆరోగ్య […]

న్యూయార్క్.. కరోనా రోగులకు విటమిన్ సితో చికిత్స
Follow us on

న్యూయార్క్ లోని ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్సలో భాగంగా విటమిన్ ‘సి’ఇస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు. చైనాలోని వూహాన్ లో గల ఆసుపత్రుల్లోనూ కరోనా వ్యాధిగ్రస్తులకు ఇదే మెడిసిన్ ఇవ్వగా మంచి ఫలితాలనిచ్చిందని ఏండ్రు వెబర్ అనే డాక్టర్ వెల్లడించారు. నార్త్ వెల్త్ హెల్త్ ఆస్పత్రిలో క్రిటికల్ కండిషన్ లో ఐసీయులో ఉన్న పేషంట్లకు 1500 మిల్లీగ్రాముల విటమిన్ సి ఇఛ్చినట్టు ఆయన చెప్పారు. రోజుకు మూడు లేదా నాలుగు సార్లు ఈ టాబ్లెట్స్ ఇస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించిందని ఆయన అన్నారు. మగ రోగులకు 90 మిల్లీగ్రాముల చొప్పున, మహిళా రోగులకు 75 మిల్లీగ్రాముల చొప్పున ఈ మెడిసిన్ ఇస్తున్నామని, ఇది తీసుకోని రోగులకన్నా.. తీసుకున్న రోగులు దాదాపు కోలుకున్న స్థితిలో కనిపించారని వెబర్ పేర్కొన్నారు. చైనాలోని వూహన్ తో బాటు శాంఘైలోగల ఆసుపత్రుల్లో కరోనా రోగులకు ప్రయోగాత్మకంగా గత ఫిబ్రవరి 14 నుంచి ఈ విటమిన్ సి ఇస్తూ వచ్చారన్నారు. వెబర్ పని చేస్తున్న ఆసుపత్రిలో సుమారు 700 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో ఎంతమందికి ఈ విటమిన్ సి ఇస్తున్నారో తెలియలేదు. రోగులకు దీంతో బాటు యాంటీ మలేరియా డ్రగ్ ‘హైడ్రాక్సిక్లోరోక్విన్’ కూడా ఇస్తున్నట్టు హెల్త్ కమిషన్ పేర్కొంది.