కోవిడ్-19 వ్యాక్సీన్ పరీక్షలు ప్రారంభించిన మోడెర్నా

| Edited By: Ravi Kiran

Jul 28, 2020 | 12:09 PM

కరోనా వైరస్ పై అమెరికాలోని రెండు పెద్ద కంపెనీలు మోడెర్నా-ఫైజర్ తమ వ్యాక్సీన్ ఉత్పత్తులను ఉధృతం చేశాయి. అదే సమయంలో వీటి పరీక్షలకోసం వేలాది వలంటీర్లను ఎంపిక చేసుకున్నాయి. మోడెర్నా సంస్థకు..

కోవిడ్-19 వ్యాక్సీన్ పరీక్షలు ప్రారంభించిన మోడెర్నా
Follow us on

కరోనా వైరస్ పై అమెరికాలోని రెండు పెద్ద కంపెనీలు మోడెర్నా-ఫైజర్ తమ వ్యాక్సీన్ ఉత్పత్తులను ఉధృతం చేశాయి. అదే సమయంలో వీటి పరీక్షలకోసం వేలాది వలంటీర్లను ఎంపిక చేసుకున్నాయి. మోడెర్నా సంస్థకు అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం నుంచి దాదాపు వందకోట్ల బిలియన్ డాలర్ల విరాళం అందింది. తన ‘ఆపరేషన్ వార్ స్పీడ్ ప్రోగ్రామ్’ కింద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేకమంది వలంటీర్లకు ఆర్థికంగా సాయపడడం కూడా పరోక్షంగా కరోనా వ్యాప్తి నివారణకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో మోడెర్నా, ఫైజర్ సంస్థలు 30 వేల సబ్జెక్ట్ ట్రయళ్ళను చేపట్టడం విశేషం. సంప్రదాయక వ్యాక్సీన్ కన్నా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఈ వ్యాక్సీన్లు తయారవుతున్నాయి. ఈ సంవత్సరాంతానికి ఇవి లాంచ్ కావచ్ఛునని భావిస్తున్నారు.

కాగా-ఈ రెండు కంపెనీలకు రెగ్యులేటరీ ఆమోదం లభించాల్సి ఉంది. తమ ట్రయల్ సక్సెస్ అయిన పక్షంలో అక్టోబరుకల్లా తమకు అప్రూవల్ లభించవచ్చునని, ఈ సంవత్సరాంతానికి సుమారు 50 లక్షల మంది రోగులకు వ్యాక్సీన్ ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నామని ఫైజర్ సంస్థ తెలిపింది. వ్యాక్సీన్ల ఉత్పత్తి, పరీక్షల విషయంలో ఈ రెండ్జు కంపెనీలు తాజా సమాచారాన్ని వెల్లడించాయి. దీంతో మోడెర్నా షేర్లు 9 శాతం, ఫైజర్ షేర్లు 1.6 శాతం చొప్పున పెరిగాయి.