‘వాళ్ళు అలా అంటున్నారు’.. లాక్ డౌన్ పొడిగింపుపై దీదీ

| Edited By: Pardhasaradhi Peri

Apr 29, 2020 | 7:00 PM

పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసులు తగ్గాలంటే లాక్ డౌన్ ని మే నెలాఖరువరకు పొడిగించాలని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారని ఈ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. పలు దేశాలు కూడా కరోనా మహమ్మారిని అణచివేసేందుకు లాక్ డౌన్ పొడిగించాలనే అభిప్రాయపడుతున్నాయని ఆమె తెలిపారు. అయితే ఆరెంజ్ జోన్లలో పాక్షిక సడలింపులు ఉంటాయని, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు సమయాల వారీగా అనుమతిస్తామని ఆమె చెప్పారు. తమ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపుపై […]

వాళ్ళు అలా అంటున్నారు.. లాక్ డౌన్ పొడిగింపుపై దీదీ
Follow us on

పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసులు తగ్గాలంటే లాక్ డౌన్ ని మే నెలాఖరువరకు పొడిగించాలని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారని ఈ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. పలు దేశాలు కూడా కరోనా మహమ్మారిని అణచివేసేందుకు లాక్ డౌన్ పొడిగించాలనే అభిప్రాయపడుతున్నాయని ఆమె తెలిపారు. అయితే ఆరెంజ్ జోన్లలో పాక్షిక సడలింపులు ఉంటాయని, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు సమయాల వారీగా అనుమతిస్తామని ఆమె చెప్పారు. తమ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపుపై బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలువురు మంత్రులు లాక్ డౌన్ పొడిగింపునకే సుముఖత వ్యక్తం చేసినట్టు ఆమె పేర్కొన్నారు. మే నెలాఖరు వరకే కాకుండా జూన్ మొదటివారం వరకు దీన్ని పొడిగించినా అభ్యంతరం లేదని కొంతమంది అభిప్రాయపడినట్టు చెప్పారు. వర్షాకాలం సీజన్ వచ్చినా కరోనా వైరస్ అంతం కాదని నిపుణులు పేర్కొన్న విషయాన్ని మమతా బెనర్జీ గుర్తు చేశారు.