బ్రిటన్ లో జూన్ వరకు లాక్ డౌన్ పొడిగింపు

| Edited By: Pardhasaradhi Peri

Apr 30, 2020 | 3:51 PM

దేశంలో జూన్ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు బ్రిటన్  ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.  కరోనా వ్యాధికి గురై.. చికిత్స పొంది కోలుకున్న అనంతరం.. సుమారు పదిహేను రోజులుగా పాలనాపరమైన బాధ్యతలకు దూరంగా ఉన్న ఆయన గురువారం మొదటిసారిగా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. కరోనా ఇంకా కరాళ  నృత్యం చేస్తూనే ఉన్నందున.. లాక్ డౌన్ పొడిగించాల్సిందేనని పలువురు మంత్రులు ఆయనను కోరారు. ఈ సమావేశంలో.. దేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశస్థులను వారి వారి స్వదేశాలకు ఎలా పంపివేయాలన్నదానిపైనా […]

బ్రిటన్ లో జూన్ వరకు లాక్ డౌన్ పొడిగింపు
Follow us on

దేశంలో జూన్ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు బ్రిటన్  ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.  కరోనా వ్యాధికి గురై.. చికిత్స పొంది కోలుకున్న అనంతరం.. సుమారు పదిహేను రోజులుగా పాలనాపరమైన బాధ్యతలకు దూరంగా ఉన్న ఆయన గురువారం మొదటిసారిగా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. కరోనా ఇంకా కరాళ  నృత్యం చేస్తూనే ఉన్నందున.. లాక్ డౌన్ పొడిగించాల్సిందేనని పలువురు మంత్రులు ఆయనను కోరారు. ఈ సమావేశంలో.. దేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశస్థులను వారి వారి స్వదేశాలకు ఎలా పంపివేయాలన్నదానిపైనా చర్చించారు. ఇండియాలో మాదిరే ఎగ్జిట్ ప్లాన్ ను తాము కూడా అమలు చేయడానికి బోరిస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించనున్నారు. ఇలా ఉండగా.. లాక్ డౌన్ ను ఎత్తివేసిన పక్షంలో వేలాది కరోనా రోగులు మృత్యు బాట పట్టవచ్ఛునని, కరోనా మరింతగా విజృంభించే సూచనలు ఉన్నాయని డాక్టర్లు హెచ్చరించారు. దేశ ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవానికి లాక్ డౌన్ ని ఎత్తివేసి.. నేషనల్ హెల్త్ సర్వీసును ఒక సాధనంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం చూసిన పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ సంఘం వార్నింగ్ ఇచ్చింది. డాక్టర్లలో మూడో వంతు మందికి తగినన్ని పర్సనల్ ప్రొటెక్టివ్ ఈక్విప్ మెంట్స్ లేవని, వారికి తగినన్ని కరోనా నివారణ సూట్లు లేక ఏప్రన్ల నే వాడవలసి వస్తోందని ఈ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.