కేరళ ఐఏఎస్ అధికారి నిర్లక్ష్యం.. ప్రభుత్వ కలవరం

| Edited By: Pardhasaradhi Peri

Mar 27, 2020 | 4:27 PM

కేరళలో అనుపమ్ మిశ్రా అనే ఐఏఎస్ అధికారి నిర్లక్ష్యంపై ప్రభుత్వం మండిపడుతోంది. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో సింగపూర్ వెళ్లి వఛ్చిన ఈయన కేరళలోని కొల్లం జిల్లాకు చేరుకొని, చెప్పా పెట్టకుండా తన సొంత సిటీ అయిన యూపీలోని కాన్పూర్ వెళ్ళాడట. నిజానికి విదేశాలకు వెళ్లి వఛ్చినవారు తప్పనిసరిగా 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్లాల్సిఉంటుంది. ఇది ప్రోటోకాల్ పద్ధతి. కానీ మిశ్రా ఈ ప్రోటోకాల్ పట్టించుకోకుండా కాన్పూర్ ని విజిట్ చేశాడు. తన పెళ్లి […]

కేరళ ఐఏఎస్ అధికారి నిర్లక్ష్యం.. ప్రభుత్వ కలవరం
Follow us on

కేరళలో అనుపమ్ మిశ్రా అనే ఐఏఎస్ అధికారి నిర్లక్ష్యంపై ప్రభుత్వం మండిపడుతోంది. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో సింగపూర్ వెళ్లి వఛ్చిన ఈయన కేరళలోని కొల్లం జిల్లాకు చేరుకొని, చెప్పా పెట్టకుండా తన సొంత సిటీ అయిన యూపీలోని కాన్పూర్ వెళ్ళాడట. నిజానికి విదేశాలకు వెళ్లి వఛ్చినవారు తప్పనిసరిగా 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్లాల్సిఉంటుంది. ఇది ప్రోటోకాల్ పద్ధతి. కానీ మిశ్రా ఈ ప్రోటోకాల్ పట్టించుకోకుండా కాన్పూర్ ని విజిట్ చేశాడు. తన పెళ్లి తరువాత సెలవులో ఉన్న మిశ్రా ..మలేసియా కూడా వెళ్లాడని తెలిసింది. కొల్లం జిల్లాలో సబ్ కలెక్టర్ గా పని చేస్తున్న ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలా అని ప్రభుత్వం యోచిస్తోంది. ఇతనిది చాలా బాధ్యతారాహిత్య ప్రవర్తన అని, ఏదో ఒక చర్య తీసుకుంటామని మత్స్య శాఖ మంత్రి జె.మెర్సికుట్టి అమ్మ అంటున్నారు. అసలు కొల్లం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఈ దృష్ట్యా మిశ్రా కారణంగా కరోనా పాజిటివ్ ఏ వ్యక్తికైనా సోకే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ రాష్ట్రంలో 126 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది రోగులను డిశ్చార్జి చేశారు. వీరిలో ఇద్దరు బ్రిటిషర్లు కూడా ఉన్నారు. రాష్ట్రంలో లక్షా 20 వేల మంది మీద వైద్య  సంబంధ నిఘా ఉంది.