కర్నాటక.. బడుగు వర్గాలకోసం రూ. 1600 కోట్ల లాకౌట్ రిలీఫ్

| Edited By: Pardhasaradhi Peri

May 06, 2020 | 3:24 PM

కర్నాటకలో సీఎం ఎదియూరప్ప ప్రభుత్వం.. లాకౌట్ వల్ల అష్టకష్టాలు పడుతున్న బడుగు జీవులకు భారీ రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం రూ.1610 కోట్ల ఈ ప్యాకేజీ వల్ల రాష్ట్రంలోని చిన్న, చితకా వ్యాపారులకు, వివిధ వృత్తులలో ఉన్నవారికి ప్రయోజనం కలుగుతుందని ఎదియూరప్ప అంటున్నారు. ఈ ప్యాకేజీ కింద ధోభీలకు, బార్బర్లకు, ఇంకా పూల ఉత్పత్తిదారులకు ఆర్ధిక సాయం అందనుంది.  వీరితో బాటు ఆటో, టాక్సీ డ్రైవర్లకు, మైక్రో , చిన్న, మధ్య తరహా పరిశ్రమలవారికి ఊరట కలుగనుంది.  […]

కర్నాటక.. బడుగు వర్గాలకోసం రూ. 1600 కోట్ల లాకౌట్ రిలీఫ్
Follow us on

కర్నాటకలో సీఎం ఎదియూరప్ప ప్రభుత్వం.. లాకౌట్ వల్ల అష్టకష్టాలు పడుతున్న బడుగు జీవులకు భారీ రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం రూ.1610 కోట్ల ఈ ప్యాకేజీ వల్ల రాష్ట్రంలోని చిన్న, చితకా వ్యాపారులకు, వివిధ వృత్తులలో ఉన్నవారికి ప్రయోజనం కలుగుతుందని ఎదియూరప్ప అంటున్నారు. ఈ ప్యాకేజీ కింద ధోభీలకు, బార్బర్లకు, ఇంకా పూల ఉత్పత్తిదారులకు ఆర్ధిక సాయం అందనుంది.  వీరితో బాటు ఆటో, టాక్సీ డ్రైవర్లకు, మైక్రో , చిన్న, మధ్య తరహా పరిశ్రమలవారికి ఊరట కలుగనుంది.  పూల విక్రయదారులకు హెక్టారుకు రూ. 25 వేల పరిహారం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ధోబీలు, బార్బర్లకు, ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5 వేలు, నిర్మాణ రంగ కార్మికులకు ఇదివరకు ఇఛ్చిన రెండు వేలు కాక, మరో మూడు వేలు ఆర్ధిక సాయం అందుతుంది.

రాష్ట్రంలో 60 వేల మంది ధోబీలు, రెండు లక్షల 30 వేల మంది బార్బర్లు ఉన్నారని ఎదియూరప్ప తెలిపారు, చేనేత కార్మికులకు రెండు వేల సాయం లభిస్తుందన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి విద్యుత్ బిల్లుల చెల్లింపును  రెండు నెలలు మాఫీ చేస్తామని, పెద్ద పరిశ్రమలు ఈ బిల్లుల పే మెంట్ ని రెండు నెలల పాటు వాయిదా వేశామని ముఖ్యమంత్రి చెప్పారు.