నాలుగు రాష్ట్రాల వారికి కర్నాటక ‘నో ఎంట్రీ’ !

| Edited By: Pardhasaradhi Peri

May 18, 2020 | 3:03 PM

కర్నాటకలో సీఎం ఎదియూరప్ప ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వచ్ఛే అంతర్జాతీయ, రాష్ట్రీయ ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమతించరాదని నిర్ణయం తీసుకుంది. వీరి తరలింపు  ఆయా రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే జరగాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కర్ణాటక సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న విషయం గమనార్హం. మరోవైపు కర్ణాటకలో పలు […]

నాలుగు రాష్ట్రాల వారికి  కర్నాటక నో ఎంట్రీ !
Follow us on

కర్నాటకలో సీఎం ఎదియూరప్ప ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వచ్ఛే అంతర్జాతీయ, రాష్ట్రీయ ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమతించరాదని నిర్ణయం తీసుకుంది. వీరి తరలింపు  ఆయా రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే జరగాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కర్ణాటక సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న విషయం గమనార్హం. మరోవైపు కర్ణాటకలో పలు ఆంక్షలను సడలించారు. భౌతిక దూరం పాటింపు నిబంధనలతో అన్ని రైళ్లను, బస్సులను అనుమతించనున్నారు. బస్సుల్లో 30 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. మంగళవారం నుంచి ఉబేర్, ఓలా   ట్యాక్సీ సర్వీసులను, పార్కులను కూడా అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆదివారాల్లో మాత్రం అత్యవసర సర్వీసులు మినహా అన్నింటిపైనా లాక్ డౌన్ ఆంక్షలను ఖఛ్చితంగా అమలు చేయనున్నారు.