విదేశాల్లో చిక్కుబడిన భారతీయుల తరలింపు 7 నుంచి

| Edited By: Pardhasaradhi Peri

May 04, 2020 | 7:11 PM

విదేశాల్లో చిక్కుబడిపోయిన భారతీయులను ఈ నెల 7 నుంచి తరలించే ప్రక్రియ ప్రారంభం కానుంది. విమానాలు, నౌకల ద్వారా వారిని స్వదేశానికి తరలించనున్నారు. ఇందుకు సంబంధించి  ప్రభుత్వం ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలను, హైకమిషనర్లను అప్పుడే సంప్రదించడం ప్రారంభించింది. అయితే తాము స్వదేశానికి రాగోరే వారు టికెట్లను కొనుగోలు చేయవలసి ఉంటుంది. వారికి అన్ని పరీక్షలు చేస్తారని, స్క్రీనింగ్ టెస్టుల్లో వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిశాకే ప్రయాణానికి అనుమతిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. […]

విదేశాల్లో చిక్కుబడిన భారతీయుల తరలింపు 7 నుంచి
Follow us on

విదేశాల్లో చిక్కుబడిపోయిన భారతీయులను ఈ నెల 7 నుంచి తరలించే ప్రక్రియ ప్రారంభం కానుంది. విమానాలు, నౌకల ద్వారా వారిని స్వదేశానికి తరలించనున్నారు. ఇందుకు సంబంధించి  ప్రభుత్వం ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలను, హైకమిషనర్లను అప్పుడే సంప్రదించడం ప్రారంభించింది. అయితే తాము స్వదేశానికి రాగోరే వారు టికెట్లను కొనుగోలు చేయవలసి ఉంటుంది. వారికి అన్ని పరీక్షలు చేస్తారని, స్క్రీనింగ్ టెస్టుల్లో వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిశాకే ప్రయాణానికి అనుమతిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారు తప్పనిసరిగా ట్రావెల్ ప్రోటోకాల్ ను పాటించవలసి ఉంటుంది. సామాజిక దూరం పాటింపు, మాస్కులు తప్పనిసరి.. కరోనా పాజిటివ్ ఉన్నవారిని వెంటనే క్వారంటైన్ కి తరలిస్తారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ విషయంలో అప్రమత్తం చేయనున్నారు.