Coronavirus India: దేశంలో కొత్తగా 13,423 రికవరీలు.. గత 24గంటల్లో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..?

|

Feb 02, 2021 | 10:25 AM

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్య కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా...

Coronavirus India: దేశంలో కొత్తగా 13,423 రికవరీలు.. గత 24గంటల్లో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..?
Follow us on

Coronavirus updates in India: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్య కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గత 24గంటల్లో సోమవారం 8,635 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 94మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైనా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,66,245 కి చేరగా.. మరణాల సంఖ్య 1,54,486 కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా నిన్న కరోనా నుంచి 13,423 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,04,48,406 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,63,353 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో దేశంలో కరోనా రికవరీ రేటు 97.05 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.43 శాతంగా ఉంది.

నిన్న దేశవ్యాప్తంగా 6,59,422 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఫిబ్రవరి 1 వరకు మొత్తం 19,77,52,057 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

Also Read:

Gold Smuggling Chennai: 8మంది కడుపులో 4 కేజీల బంగారం ఉండలు.. కస్టమ్స్ అధికారులు సీజ్